JANASENA LEADER NAGABABU ABOUT RAMOJI RAO : మార్గదర్శి కేసులో ఆ సంస్థ ఛైర్మన్ రామోజీరావును ఇటీవలే ఏపీ సీఐడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. అయితే రామోజీరావు విచారణను జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు ఖండించారు. విచారణ పేరిట వారి కుటుంబాన్ని వేధించడం శోషనీయమన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
తెలుగు మీడియా, సినీ రంగాల్లో విప్లవాత్మకమైన అభివృద్ధిని తీసుకొచ్చి.. వ్యాపార రంగంలో వేలాది మందికి జీవనాధారం కల్పిస్తూ, కళారంగంలో "గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్"లో చోటు దక్కించుకొని.. ప్రపంచస్థాయిలో తెలుగు ఖ్యాతిని చాటి చెప్పిన "పద్మ విభూషణ్" రామోజీరావు లక్షలాది మందికి ఆదర్శప్రాయులని ఆయన స్పష్టం చేశారు. ఆరు దశాబ్దాల ప్రస్థానంలో ఆయనకు ఎదురుకాని అవినీతి ఆరోపణలు కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే పుట్టుకు రావడం విచారకరమన్నారు. 8 పదుల వయసు పైబడిన రామోజీరావుని, ఆయన కుటుంబాన్ని విచారణ పేరుతో వేధించడం శోచనీయమని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. రామోజీరావుపై సామాజిక మాధ్యమాల్లో కావాలని చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నామని ఆయన తెలిపారు.
"తెలుగు మీడియా, సినీ రంగాల్లో విప్లవాత్మకమైన అభివృద్ధిని తీసుకొచ్చి, వ్యాపార రంగంలో వేల మందికి జీవనాధారం కల్పిస్తూ కళా రంగంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో చోటు దక్కించుకుని, ప్రపంచ స్థాయిలో తెలుగు ఖ్యాతిని చాటి చెప్పిన పద్మవిభూషణ్ రామోజీరావు లక్షల మందికి ఆదర్శప్రాయులు. ఆరు దశాబ్దాల ప్రస్థానంలో ఆయనకు ఎదురుకాని ఆరోపణలు వైసీపీ అధికారంలోకి వచ్చాకే పుట్టుకురావడం విచారకరం. ఎనిమిది పదుల వయసు పైబడిన రామోజీరావును, ఆయన కుటుంబాన్ని విచారణ పేరుతో వేధించడం శోచనీయం’’-ట్విట్టర్లో జనసేన నేత నాగబాబు
రామోజీరావును విచారించిన సీఐడీ: మార్గదర్శి చిట్‌ఫండ్‌పై నమోదు చేసిన కేసు దర్యాప్తు పేరుతో ఆ సంస్థ ఛైర్మన్ రామోజీరావును ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు(ఏప్రిల్ 3) సోమవారం విచారించారు. అనారోగ్యం వల్ల హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కుమారుడు కిరణ్ ఇంట్లో ఉంటూ.. రామోజీరావు చికిత్స తీసుకుంటున్నారు. సోమవారం పదిన్నరకు అక్కడికి వెళ్లిన.. సీఐడీ అధికారుల బృందం సుమారు 5 గంటల పాటు విచారించింది. సీఐడీ ఎస్పీ అమిత్ బర్దార్ ఆధ్వర్యంలో 23మందితో కూడిన బృందం ఉదయం పదిన్నర గంటలకు.. జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకుంది. పదకొండున్నరకు విచారణ ఆరంభించింది. గంట తర్వాత.. రామోజీరావు అనారోగ్యం కారణంగా అలసట చెందినట్టు కన్పించడంతో.. అధికారులు కాసేపు విరామమిచ్చారు. ఈ సమయంలో కుటుంబ వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు.. ఆయన్ను పరీక్షించారు. మళ్లీ రెండున్నరకు విచారణ ఆరంభించిన అధికారులు.. సాయంత్రం ఐదున్నర గంటలకు ముగించారు. ఏడున్నర గంటల వరకూ..అక్కడే ఉన్నారు. తాము నమోదు చేసిన కేసుకు సంబంధించి.. మొత్తం 46 ప్రశ్నలు అడిగారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ వైద్య బృందం పర్యవేక్షణలో.. సీఐడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు రామోజీరావు సమాధానాలు చెప్పారు.
ఇవీ చదవండి: