Janasena leader Nadendla Manohar: బ్రిటీష్ కాలం నాటి చట్టం ద్వారా ఆంక్షలు విధిస్తారా? అంటూ జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోపై నిప్పులు చెరిగారు. రాజకీయ పార్టీలను నియంత్రించాలనే అర్ధరాత్రి జీవోలు తెస్తున్నారని ఆరోపించారు. ఈ జీవోలతో వైకాపా ప్రభుత్వం తన నిరంకుశ ధోరణి బయటపెట్టుకుందని నాదెండ్ల ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. వైకాపా నేతలు ఏదో ఒకరోజు జీవించే హక్కును సైతం హరిస్తారని నిమర్శించారు. శాంతిభద్రతల పేరుతో హక్కులు కాలరాయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని ఆయన పేర్కొన్నారు.
జీవించే హక్కును సైతం హరిస్తారేమో..!: నాదెండ్ల మనోహర్
Nadendla Manohar on GO No 1 respond: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.1పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అర్ధరాత్రి జీవోల ప్రభుత్వం అంటూ టీడీపీ నేతలు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తుండగా.. ఇదే అంశంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. బ్రిటీష్ కాలం నాటి జీవోలను అమలుపరుస్తున్నారంటూ విమర్శించారు. ప్రతిపక్షాలను ఇబ్బందులు పెట్టేందుకే జీవో నెం1 తీసుకువచ్చారని విమర్శించారు.
జీవో నెంబర్ 1: రాష్ట్రంలో రోడ్ షో సభలు, ర్యాలీలను నియంత్రించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. మున్సిపల్, పంచాయతీ రహదారులు, రోడ్డు మార్జిన్ల వద్ద పోలీసు యాక్ట్ నిబంధనలను అమలు చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో రోడ్డు షోలు నిర్వహించకుండా చూడాలని ఆదేశాల్లో హోంశాఖ పేర్కొంది. ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలు, ర్యాలీలు జరిగేలా చూడాలని స్పష్టం చేసింది. అత్యంత అరుదైన సందర్భాల్లో షరతులతో కూడిన అనుమతివ్వనున్నట్లు పేర్కొంది.
ఇవీ చదవండి: