వైకాపా విముక్త ఏపీ కోసం అంతా కలిసి పని చేస్తాం: నాదెండ్ల - బీజేపీ నేత కన్నాతో జనసేన నేత మనోహర్ భేటీ అయ్యారు
19:23 December 14
సోము వీర్రాజు నాయకత్వంపై కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న కన్నా
Nadendla Manohar Met BJP leader Kanna: ఏపీ భాజపా కీలక నేత కన్నా లక్ష్మీనారాయణతో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ కావడం.. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వంపై కన్నా కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గుంటూరులోని ఆయన ఇంటికి నాదెండ్ల వెళ్లారు. ఈ భేటీలో తొలుత భాజపా, జనసేన నాయకులు 10 నిమిషాలు మాట్లాడుకోగా.. ఆ తర్వాత మనోహర్, కన్నా 45 నిమిషాలకు పైగా ఏకాంతంగా చర్చించుకున్నారు. రాష్ట్రంలో ఉన్న వాస్తవ రాజకీయ పరిస్థితులపై కన్నాతో చర్చించినట్లు మనోహర్ చెప్పారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అంతా కలిసి పని చేయాలని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఇవీ చదవండి: