భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణతో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. గుంటూరులోని కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో ఈ భేటీ జరిగింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పని చేయటంపై చర్చించారు. గుంటూరు నగరంలో కన్నాకు పట్టుండటంతో భాజపా, జనసేన తరఫున కార్పోరేటర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని మనోహర్ విజ్ఞప్తి చేశారు. కన్నా అందుకు సానుకూలంగా స్పందించారు. జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో రెండు పార్టీల అభ్యర్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు కలిసి పనిచేద్దామని చెప్పినట్లు తెలుస్తోంది.
భాజపా నేత కన్నాతో జనసేన నాయకుడు నాదెండ్ల భేటీ - జనసేన బీజేపీ తాజా
భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణతో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పని చేయటంపై చర్చించారు.
భాజపా మాజీ అధ్యక్షులు కన్నాతో జనసేన నేత నాదెండ్ల భేటీ
TAGGED:
nadendla latest news