ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు'.. జనసేన వినూత్న కార్యక్రమం - జగనన్న కాలనీలపై నాదెండ్ల మనోహర్​

Nadendla Manohar: జగనన్న కాలనీల పేరుతో జరిగిన అవినీతి బయటపెడతామని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. దీనికోసం జనసేన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుందని ఆయన తెలిపారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Nov 9, 2022, 10:02 PM IST

Janasena Nadendla Manohar : జగనన్న కాలనీల పేరుతో రాష్ట్రంలో అతి పెద్ద స్కాం జరిగిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఈ అవినీతిని బట్టబయలు చేయడానికే ఈ నెల 12, 13, 14 తేదీల్లో జనసేన సోషల్ ఆడిట్ చేపట్టనుందన్నారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా రాష్ట్రంలో ఏదో ఒక చోట కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. 'జగనన్నఇళ్లు-పేదలందరికీ కన్నీళ్లు' పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నట్లు మనోహర్‌ వెల్లడించారు.

ఇళ్ల స్థలాల కోసం కోట్ల రూపాయలు ప్రజాధనం వెచ్చించి భూములు కొన్నారని.. భూముల కొనుగోలు విషయంలో అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. అలాగే మౌలిక వసతుల పేరిట ప్రభుత్వం కోట్లు కేటాయించినా.. కనీసం తాగునీరు, రోడ్ల సదుపాయాలు కూడా లేవన్నారు. దీనిపై సమాధానం చెప్పాలని నాదెండ్ల మనోహర్​ డిమాండ్​ చేశారు.

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details