ఈ నెల 16న గుంటూరు జిల్లా ధర్మవరంలో తిరునాళ్ల సందర్భంగా.... నాటకాలు ప్రదర్శిస్తుండగా ఇరువర్గాల మధ్య వివాదం జరిగింది. కొందరు జనసేన కార్యకర్తలు పార్టీ జెండాను ప్రదర్శించడంపై...వేరే పార్టీ వర్గీయులు అభ్యంతరం తెలపటంతో ఈ వివాదం చెలరేగింది.ఈ ఘటనను ఆపేందుకు వెళ్లిన పోలీసులపై స్ధానికులు దాడికి దిగారని గ్రామీణ ఎస్పీ విజయరావు తెలిపారు. జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి పోలీసులు అరెస్ట్ చేశారని.. కేసులను పునఃపరిశీలించి న్యాయం చేయాలనీ... జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఎస్పీ విజయరావుకు వినతి పత్రం అందజేశారు.
కేసులు పునఃపరిశీలించాలని గుంటూరు గ్రామీణ ఎస్పీకి జనసేన వినతి - గుంటూరు జిల్లా ధర్మవరం తిరునాళ్ల వివాదం వార్తలు
ధర్మవరం జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి పోలీసులు అరెస్ట్ చేశారని...కేసులను పునఃపరిశీలించి న్యాయం చేయాలని గుంటూరు ఎస్పీకి జనసేన పార్టీ పొలిటికల్ ఆఫైర్ కమిటీ సభ్యులు వినతి పత్రం అందజేశారు.

గుంటూరు గ్రామీణ ఎస్పీకి ... జనసేన సభ్యులు వినతి పత్రం
గుంటూరు గ్రామీణ ఎస్పీకి ... జనసేన సభ్యులు వినతి పత్రం