ప్రజలు మార్పును కోరుకుంటున్నారనేందుకు పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బోనబోయిన శ్రీనివాస యాదవ్ అన్నారు. వైకాపా దౌర్జన్యాలు, అధికార బలంతో ఎన్నికల్లో నెగ్గిందని... కానీ జనసేన మాత్రం ప్రజాబలంతో చెప్పుకోదగిన సంఖ్యలో పంచాయతీల్ని గెలుచుకుందని తెలిపారు. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగి ఉంటే జనసేన ఇంకా ఎక్కువ చోట్ల గెలిచేదన్నారు. పట్టణాలు, నగరాల్లో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ మరిన్ని మెరుగైన ఫలితాలు సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తాం: బోనబోయిన - janasena leader bonaboyina srinivas yadav
దౌర్జన్యాలు, అధికార బలంతో పంచాయతీ ఎన్నికల్లో వైకాపా నెగ్గితే..జనసేన మాత్రం ప్రజాబలంతో చెప్పుకోదగిన సంఖ్యలో పంచాయతీల్ని గెలుచుకుందని జనసేన నేత బోనబోయిన శ్రీనివాస యాదవ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మరిన్ని మెరుగైన స్థానాలను సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
ap panchayat elections 2021