ప్రభుత్వ భూముల అమ్మకాన్ని నిరసిస్తూ గుంటూరులో.. జనసేన ఆధ్వర్యంలో చేపట్టిన 24 గంటల నిరాహార దీక్షను.. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరు జనసేన పార్టీ కార్యాలయంలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిరాహారదీక్ష చేశారు.
'పీవీకే నాయుడు మార్కెట్ అమ్మకం నిలిపివేయాలి' - గుంటూరులో జనసేన నేతల నిరాహార దీక్ష వార్తలు
గుంటూరులోని పీవీకే నాయుడు మార్కెట్ అమ్మకాన్ని నిలిపివేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల అమ్మకాన్ని నిరసిస్తూ చేపట్టిన 24 గంటల నిరాహార దీక్షను నేడు విరమించారు.
గుంటూరులో జనసేన నేతల దీక్ష
లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న గుంటూరు పీవీకే నాయుడు మార్కెట్ అమ్మకాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్ ద్వారా ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్న పేదలకు, కూలీలకు భాజపా మద్దతు ఉంటుందని రావెల కిశోర్ బాబు అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరచి పాలన చేయాలని సూచించారు.
ఇవీ చదవండి.. లాక్డౌన్ ఎఫెక్ట్‌తో ఆతిథ్యరంగానికి భారీ నష్టం.