భవన నిర్మాణ కార్మికుల కోసం అన్ని పార్టీలు సంఘటితం కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. భాజపా, వామపక్షాలు ఇప్పటికే సానుకూలంగా స్పందించాయన్నారు. రాష్టంలో ఇటీవల చోటు చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు తన మనసును కలిచివేశాయని పవన్ పేర్కొన్నారు. నెలల తరబడి ఉపాధి లేక... నిర్మాణ కార్మికులు కష్టాల పాలై ఉసురు తీసుకుంటున్నారని ఆవేదన చెందారు. లక్షలాది కార్మికుల కోసం బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ముందుకొచ్చిన భాజపా, వామపక్షాలతోపాటు మిగిలిన పార్టీలు సైతం భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులపై పోరాడేందుకు కలిసి రావాలని కోరారు. నవంబర్ 3న విశాఖపట్నంలో జనసేన నిర్వహించనున్న లాంగ్‌మార్చ్‌కు సంఘీభావం తెలపాలని ట్విటర్ వేదికగా పవన్ కోరారు.
కలిసి రండి... ఇసుక కొరతపై నిలదీద్దాం: పవన్ - isuka korata vartalu
అసమగ్ర ఇసుక విధానంతో ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల ఉసురు తీస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నెలల తరబడి ఉపాధి లేక... కార్మికులు కష్టాలు పడుతున్నారని ఆవేదన చెందారు. కార్మికులకు సంఘీభావంగా వచ్చే నెల 3న విశాఖలో జనసేన తలపెట్టిన లాంగ్‌మార్చ్‌కు అన్ని పార్టీలు కలిసి రావాలని ట్విటర్లో జనసేనాని విజ్ఞప్తి చేశారు.
కలిసి రండి... ఇసుక కొరతపై నిలదీద్దాం: పవన్
Last Updated : Oct 28, 2019, 9:58 PM IST