ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు బోనబోయిన శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు. కరోనా వ్యాప్తితో ఎన్నికలు వాయిదా వేసినందుకు ఆయనపై కక్ష పెంచుకుని పదవి నుంచి తప్పించారని ఆరోపించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు వైకాపా ప్రభుత్వానికి చెంపపెట్టువంటిదని అభిప్రాయపడ్డారు. కోర్టు మొట్టికాయలు వేసినందుకైనా.. ప్రభుత్వం తెలివి తెచ్చుకోవాలని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల ప్రక్రియ రద్దు చేసి... మళ్లీ మొదటి నుంచి నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర యంత్రాంగంపై తమకు నమ్మకం లేదని.. కేంద్ర బలగాల సాయంతో, కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.
'స్థానిక ఎన్నికల ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి నిర్వహించాలి' - జనసేన నేతబోనబోయిన శ్రీనివాసయాదవ్ వార్తలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో కోర్టు మొట్టికాయలు వేసినందుకైనా.. ప్రభుత్వం తెలివి తెచ్చుకోవాలని జనసేన నేత బోనబోయిన శ్రీనివాసయాదవ్ హితవుపలికారు. స్థానిక ఎన్నికల ప్రక్రియ రద్దు చేసి... మళ్లీ మొదటి నుంచి నిర్వహించాలని డిమాండ్ చేశారు.
janasena comments on ysrcp