ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా నేతలు.. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు: జనసేన - గుంటూరు జిల్లాలో జనసేన పర్యటన

గుంటూరు జిల్లా జైలులో ఉన్న అమరావతి రైతులను పరామర్శించేందుకు.. జైల్ వద్దకు వచ్చిన కృష్ణ-గుంటూరు జనసేన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అధికారాలు అనుమతి లేకుండా జిల్లా జైల్ వద్దకు రావడానికి వీలులేదన్నారు. దీంతో పోలీసులకు, జనసేన నాయకులకు మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది.

janasena comments
janasena comments

By

Published : Nov 2, 2020, 12:43 PM IST

రైతులను పరామర్శించేందుకు గుంటూరు జిల్లా జైలుకు వచ్చిన జనసేన నాయకులు పోలీసులు అడ్డుకున్నారు. ఇది దుర్మార్గపు చర్యని జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

రాజధాని కోసం రైతులు ఉద్యమం చేస్తుంటే.. అధికార పార్టీ నేతలు పెయిడ్ ఆర్టిస్టులతో పోటీగా మరో ఉద్యమం చేపట్టారన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటున్నా.. బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ , గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఇద్దరు రాజీనామా చేసి మరల ఎన్నికలకు రావాలన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఇద్దరు ఎంపీలు కట్టుబడి ఉండాలన్నారు. అప్పుడు అమరావతి రాజధానిగా కావాలో.. మూడు రాజధానులు కావాలా తేలిపోతుందన్నారు.

రైతుల అరెస్టులు దారుణం

రాజధాని నిర్మాణానికి భూములు త్యాగం చేసిన రైతులను దేశద్రోహులు మాదిరిగా పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమని జనసేన నాయకులు పోతిన మహేష్ అన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన వైకాపా నేతలు.. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారన్నారు. రైతులు భూములు ఇచ్చిన నేరానికి అరెస్టులు చేయడం, ఈడ్చుకుంటూ వెళ్లడం బాధాకరమన్నారు. ఇలాంటి పాలన దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. సీఎం జగన్ 2009 కొన్న భూములను రియల్ ఏస్టేట్ చేసుకోవాడనికే.. మూడు రాజధాన్లు నిర్ణయాన్ని తెర పైకి తీసుకువచ్చారన్నారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలను ఎస్సీ, ఎస్టీల పైన అమలు చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానిది దక్కుతుందని విమర్శలు గుప్పించారు. ఒక్క చాన్స్ అని రోడ్డుపైకి వచ్చిన వైఎస్ విజయమ్మ, షర్మిల.. బయటకు వచ్చి రోడ్డున పడిన అమరావతి రైతులకు సంఘీభావం తెలపాలని డిమాండ్ చేశారు. తక్షణమే మూడు రాజధానల అంశాన్ని ఉపసహరించుకకోవాలని.. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని స్పష్టంచేశారు.

ఇదీ చదవండి:తెరుచుకున్న పాఠశాలలు... కొవిడ్ నిబంధనలు తప్పనిసరి

ABOUT THE AUTHOR

...view details