ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అప్పు రత్న' అవార్డు గోస్​ టూ సీఎం జగన్​: పవన్​ - latest news on pawan

PAWAN TWEET ON CM JAGAN : రాష్ట్ర అప్పులపై జనసేన అధినేత పవన్​కల్యాణ్​ స్పందించారు. రాష్ట్రాభివృద్ధి, సంపదను కుక్కలకు వదిలేయండని.. మీ ఆస్తులను మాత్రం పెంచుకోడంటూ ట్విట్టర్​ వేదికగా జగన్​పై మండిపడ్డారు.

PAWAN TWEET ON CM JAGAN
PAWAN TWEET ON CM JAGAN

By

Published : Feb 7, 2023, 1:47 PM IST

Updated : Feb 7, 2023, 2:28 PM IST

PAWAN TWEET ON CM JAGAN : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న అప్పులు.. కొత్త రికార్డులు నమోదు చేసే స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన 9 నెలల కాలానికి ఏపీ ప్రభుత్వం చేసిన అప్పు స్థూలంగా రూ.55 వేల 555 కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు.

‘‘అప్పులతో ఏపీ పేరు మారుమోగిస్తున్నందుకు సీఎం జగన్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు. అప్పులతో ఆంధ్రా పేరును ఇలానే కొనసాగించండి. మీ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం మాత్రం మరచిపోవద్దు. రాష్ట్రాభివృద్ధి, సంపదను కుక్కలకు వదిలేయండి. భారతరత్న మాదిరిగా అప్పురత్న అవార్డు ఇవ్వాలి’’ అని పవన్‌ పేర్కొన్నారు. అప్పు రత్న ఏపీ సీఎం అంటూ ట్యాగ్​ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 7, 2023, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details