PAWAN ON ALLIANCE : వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై స్పష్టత ఎన్నికల ముందు వస్తుందని స్పష్టం చేశారు. బీజేపీతో ఇప్పటికే పొత్తులో ఉన్నామన్నా ఆయన.. బీజేపీ కాదంటే ఒంటరిగా వెళ్తామని స్పష్టం చేశారు. కొత్త పొత్తులు వస్తే ఆ పార్టీలతో కలిసి వెళ్తామని తేల్చిచెప్పారు. ఓట్లు చీలకూడదన్నదే తన అభిప్రాయమన్న పవన్.. అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
వైసీపీ వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు వస్తాయన్న నమ్మకం ఉంటే.. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీకి విశ్వాసం సన్నగిల్లుతోందని విమర్శించారు. దావోస్ పర్యటనలో ఏపీ గురించి తెలిసిందే కదా అని వ్యాఖ్యానించారు. ఏపీలో లోకేశ్ పర్యటన, తన పర్యటన అడ్డుకుంటే వారికి వైసీపీకి వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం లేనట్లే అని తేల్చిచెప్పారు.
"పొత్తులపై స్పష్టత ఎన్నికల ముందు వస్తుంది. బీజేపీతో ఇప్పటికే పొత్తులో ఉన్నాం. ఆ పార్టీ కాదంటే ఒంటరిగా వెళ్తాం. కొత్త పొత్తులు వస్తే ఆ పార్టీలతో కలిసి వెళ్తాం. అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నా. 175 సీట్లు వస్తాయన్న నమ్మకం ఉంటే.. జగన్ ప్రభుత్వం ఇవన్నీ ఎందుకు చేస్తోంది. వైఎస్ఆర్సీపీకి విశ్వాసం సన్నగిల్లుతోంది. లోకేశ్ పర్యటన, నా పర్యటనను అడ్డకుంటే వారికి నమ్మకం లేనట్లే." - పవన్ కల్యాణ్, జనసేన అధినేత