లగడపాటి రాజగోపాల్ సర్వేలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని గుంటూరు జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ ముఖ్య నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రత్తిపాడు అభ్యర్థి రావెల కిషోర్ బాబు, గుంటూరు తూర్పు అభ్యర్థి జియా ఉర్ రెహమాన్ పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన స్ఫూర్తితో...రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ,.. 23న జరిగే కౌంటింగ్ ప్రక్రియలోనూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశంలో చర్చించనున్నట్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బెట్టింగ్ రాయుళ్లకు నాయకుడిలా లగడపాటి వ్యవహరిస్తున్నారని..తప్పుడు సర్వేలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే జనసేన మద్దతు అవసరమన్నారు.
'బెట్టింగ్ రాయుళ్లకు నాయకుడు లగడపాటి' - పవన్ కల్యాణ్
లగడపాటిని ఒక బుకీలా మాత్రమే భావిస్తున్నారని... ఆయన సర్వేలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని గుంటూరు జనసేన ఎంపీ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
జనసేన నాయకుల ఆత్మీయ సమావేశం