ప్రభుత్వ దేవాలయ భూములు అమ్మకానికి నిరసనగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో 24 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. గుంటూరు అమరావతి రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయంలో గత 10 రోజులుగా రిలే నిరాహారదీక్షలు నిర్వహిస్తున్నారు. నగరంలోని పీవీకే నాయుడు మార్కెట్ అమ్మకాన్ని తక్షణమే నిలిపివేయాలని, లాక్డౌన్ సమయంలో వచ్చిన విద్యుత్ బిల్లులును పూర్తిగా మాఫీ చేయాలని జనసేన పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ యాదవ్, లీగల్ కన్వీనర్ గాదె వెంకటేశ్వరరావు, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై జనసేన నిరసన - 24 gnatala dhikshalu news
దేవాలయ భూములు అమ్మకానికి నిరసనగా గుంటూరులోని అమరావతి రోడ్డులోని పార్టీ కార్యాలయంలో జనసేన ఆధ్వర్యంలో 24 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. పదో రోజు దీక్షలో గుంటూరు మార్కెట్ అమ్మకాన్ని తక్షణమే నిలిపివేయాలని, విద్యుత్ బిల్లులు తగ్గించాలని డిమాండ్ చేశారు.
![ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై జనసేన నిరసన janasena 24 hours inmates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7362495-197-7362495-1590557875341.jpg)
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జనసేన దీక్షలు