ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోలీసులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి' - అనుమతులు లేకుండా నిర్భందించటంపై జనసేన న్యాయవిభాగం మండిపాటు

ఎటువంటి అనుమతులు లేకుండా పోలీసులు జనసేన అధినేత పవన్​, ఇతర నేతలను నిర్బంధించటంపై జనసేన పార్టీ న్యాయ విభాగం మండిపడింది.

పవన్​తో పార్టీ న్యాయవిభాగం సమావేశం
పవన్​తో పార్టీ న్యాయవిభాగం సమావేశం

By

Published : Jan 21, 2020, 8:01 PM IST

పవన్​తో పార్టీ న్యాయవిభాగం సమావేశం

మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్​తో... ఆ పార్టీ రాష్ట్ర న్యాయ విభాగం సమావేశమైంది. నిన్న జరిగిన పరిణామాలపై చర్చించారు. పోలీసు అధికారులు అనుమతి లేకుండా... పార్టీ కార్యాలయంలోకి చొరబడ్డారన్నారు. పవన్​తో పాటుగా నాదెండ్ల మనోహర్​, ఇతర నాయకులను బంధించటంపై... న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన న్యాయ విభాగం తీర్మానించింది. అక్రమంగా బంధించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. ఒక పార్టీ అధ్యక్షుడిని నిర్బంధించటం రాజ్యాంగ విలువలు, వ్యక్తి స్వేచ్ఛకు విరుద్దమని వ్యాఖ్యానించింది. మందడంలో పోలీస్ దుశ్చర్యలో గాయపడిన మహిళలను పరామర్శించనీయకుండా నియంత్రించడం ప్రజాస్వామ్య విలువలను మంటకలపడమేనన్నారు.

ABOUT THE AUTHOR

...view details