సూర్యగ్రహణంపై జన విజ్ఞాన వేదిక ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. మూఢనమ్మకాలను నమ్మొద్దంటూ ..ప్రచారాన్ని చేస్తోంది. ఖగోళంలో వస్తున్న మార్పులు, గ్రహణాలు..ఇలాంటి అద్భుతాల్ని ప్రతి ఒక్కరూ చూడాలని వారు కోరారు.
ఈ అద్భుతాన్ని కచ్చితంగా చూడండి.. - jvv latest news
గ్రహణాలంటే ప్రజల్లో చాలా భయాలున్నాయి. గర్భిణులు బయటకు రాకూడదని, ఆహారం, నీరు ముట్టరాదన్న నమ్మకాలున్నాయి. గుంటూరులో సూర్యగ్రహణంపై జన విజ్ఞాన వేదిక ప్రజలకు అవగాహన కల్పించింది. నల్ల కళ్లజోడు ద్వారా గ్రహణాన్ని వీక్షించవచ్చని జేవీవీ సభ్యులు వివరించారు. సూర్యగ్రహణంపై ప్రజల అపోహలు, వీటి వెనుక శాస్త్రీయతపై జేవీవీ సభ్యులతో ఈటీవీ భారత్ ముఖాముఖి
గుంటూరులో సూర్యగ్రహణంపై జేవీవీ సదస్సు