ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వినుకొండలో తొమ్మిదెకరాల జామాయిల్ తోట దగ్ధం - జామాయిల్ తోట దగ్ధం తాజా వార్తలు

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. వినుకొండ మండలం నరగాయపాలెం గ్రామంలో.. తొమ్మిదెకరాల జామాయిల్ పంట కాలి బూడిదైంది. గుర్తుతెలియని దుండగులు.. తోటకు నిప్పంటించారు. దీంతో బాధిత రైతులు రూ.8లక్షలు నష్టపోయామంటూ రోదిస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

jamaail garden has burnt in fire at vinukonda in guntur
వినుకొండలో 9 ఎకరాల జామాయిల్ తోట దగ్ధం

By

Published : Mar 21, 2021, 1:54 PM IST

గుంటూరు జిల్లా వినుకొండలో తొమ్మిదెకారాల జామాయిల్ తోట దగ్ధమైంది. గుర్తుతెలియని దుండగులు.. అర్థరాత్రి సమయంలో తోటకు నిప్పంటించారు. వినుకొండ మండలం నరగాయపాలెం గ్రామానికి చెందిన.. నలుగురు రైతులు జామాయిల్ సాగు చేస్తున్నారు. కొందరు వ్యక్తులు ఆ తోటకు నిప్పంటించటంతో.. కాలి బూడిదైంది. దీంతో రూ.8లక్షలు నష్టపోయినట్లు రైతులు విలపిస్తున్నారు. తోటలో మంటలను ఆర్పేందుకు.. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని చర్యలు చేపట్టారు. బాధిత రైతుల నుంచి స్టేట్​మెంట్ రికార్డు చేసుకుని.. వీఆర్వో ఉన్నతాధికారులకు అందజేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

వినుకొండలో తొమ్మిదెకరాల జామాయిల్ తోట దగ్ధం

ABOUT THE AUTHOR

...view details