ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందింజే జలజీవన్ మిషన్ పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా జలజీవన్ మిషన్ అధికారుల బృందం గుంటూరు జిల్లాకు వచ్చింది. ఏపీ గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో కలిసి జొన్నలగడ్డ, దుగ్గిరాల మండలం చిలువూరు, ప్రత్తిపాడు మండలం కొండ జాగర్లమూడిలో పర్యటించారు.
ఇంటింటికీ రక్షిత నీటి సరఫరాపై డ్వాక్రా సంఘాల సభ్యులు, గ్రామ సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలతో మాట్లాడారు. పథకం గురించి వారికి అవగాహన కల్పించారు. మనం తాగే నీటిని తరచుగా పరిక్షించుకోవటం ద్వారా రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని అధికారులు తెలిపారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని వారికి సూచించారు.