అమరావతి రైతుల దీక్ష నిర్విరామంగా కొనసాగుతోంది. రాక్షస పాలన పోయి సంక్షేమ రాజ్యం రావాలంటూ 1,124వ రోజు రాజధాని రైతులు ఆందోళనలు కొనసాగించారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు పండుగరోజూ నిరసన దీక్షలలో పాల్గొన్నారు. తుళ్లూరు, వెలగపూడి, మందడంలో రైతులు, మహిళలు జై అమరావతి అంటూ నినదించారు. మూడు రాజధానులు వద్దూ... అమరావతే ముద్దంటూ నినాదాలు చేశారు. మాట తప్పిన ప్రభుత్వం... ఇప్పటికైనా హైకోర్టు తీర్పును అమలుచేసి రాజధానిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
"జై అమరావతి.." పండుగ నాడూ అదే పట్టుదల.. అలుపెరుగని అమరావతి ఉద్యమం - andhra pradesh capital
అమరావతి రైతుల దీక్ష అప్రతిహతంగా కొనసాగుతోంది. రైతులు, మహిళలు సంక్రాంతి పండుగ రోజున సైతం ఆందోళనలో పాల్గొన్నారు. అమరావతి రాజధాని తమ జీవన విధానం, నినాదమంటూ కుటుంబ సభ్యులతో కలిసి నిరసన తెలిపారు.
అమరావతి రైతు పోరాటం