భాజపా, వైకాపా మధ్య బంధంపై జగన్ ప్రభుత్వం ముసుగు తొలగించాలని... మాజీమంత్రి నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఐకాస ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహిస్తున్న దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. భాజపాతో పొత్తుపై మంత్రి బొత్స వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో రాజధాని తరలింపుపై సీఎం జగన్ ముందుగా బొత్స ద్వారానే వ్యాఖ్యలు చేయించారని గుర్తుచేశారు. కేసుల మాఫీ కోసమే ఎన్డీయేతో కలిసేందుకు యోచిస్తున్నారని ఆరోపించారు. మైనారిటీల ఓట్ల కోసం ఎన్నికల ముందు ఓ మాట.. ఎన్నికల తర్వాత మరో మాట మాట్లడటం వైకాపాకే చెల్లిందని ధ్వజమెత్తారు. రాజధాని విషయంలో భాజపా నేతలు విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైకాపాతో పొత్తు విషయంలోనైనా ఆ పార్టీ నేతలు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
'ఆ విషయంలో బొత్స వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాల్సిందే'
భాజపా, వైకాపాల కలయికపై మంత్రి బొత్స వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని... మాజీమంత్రి నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు. కేసుల మాఫీ కోసమే ఎన్డీయేతో కలిసేందుకు సీఎం జగన్ పావులు కదుపుతున్నారని వ్యాఖ్యానించారు.
కేసుల మాఫీ కోసమే ఎన్డీయేతో జగన్ పొత్తు యోచన