జగనన్న విద్యా కానుక పథకం ద్వారా సెప్టెంబర్ 5న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ అందజేసే యూనిఫామ్, బ్యాగ్, షూస్, నోట్ బుక్స్, సాక్స్ తదితర సామాగ్రిని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పరిశీలించారు. గురువారం ఉదయం కోగంటి శివయ్య హైస్కూల్లో ఏర్పాటు చేసిన విద్యార్థులు సామగ్రిని ఆయన పరిశీలించారు.
జగనన్న విద్యాకానుక సామాగ్రిని పరిశీలించిన ఎమ్మెల్యే - guntur news
సెప్టెంబర్ 5న జగనన్న విద్యా కానుక కింద అందించే కిట్లను తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పరిశీలించారు.
![జగనన్న విద్యాకానుక సామాగ్రిని పరిశీలించిన ఎమ్మెల్యే Jagananna vidya kanuka is the MLA who examined the educational materials](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8585751-843-8585751-1598585448575.jpg)
జగనన్న విద్యాకానుక సామాగ్రిని పరిశీలించిన ఎమ్మెల్యే
తెనాలి గ్రామీణ మండలంలో ఉన్న 113 పాఠశాల్లోని 13వేల 938 విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందజేయనున్నారు. దీనికి సంబంధించిన 7 వస్తువులతో కూడిన కిట్లను ప్రధానోపాధ్యాయులకు ఎమ్మెల్యే అందజేశారు. తెనాలి నియోజకవర్గానికి సంబంధించి విద్యార్థులకు అమ్మ ఒడి , విద్యా దీవెన, వసతి దీవెన, నాడు- నేడు, రాజన్న కంటి వెలుగు, జగనన్న విద్యా కానుక వంటి పథకాల ద్వారా సుమారు 100 కోట్ల రూపాయల వరకు విద్యార్థులు లబ్ధి పొందారని ఎమ్మెల్యే శివకుమార్ అన్నారు.