ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Jagananna Swachh Sankalpam Program Failed: పేరుకే 'జగనన్న స్వచ్ఛ సంకల్పం'.. ప్రభుత్వం తీరుతో మురికివాడలుగా గ్రామాలు - జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం

Jagananna Swachh Sankalpam Program Failed: గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చామని సీఎం గొప్పలు చెబుతున్నా.. నిధుల కొరతతో పంచాయతీల్లో కరవు రాజ్యం మేలుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిధుల దారి మళ్లించడంతో పంచాయతీలు పడుతున్న తిప్పలు అన్నీఇన్నీ కావు. కాళ్లు, చేతులు కట్టిపడేసి చెరువులో ఈత కొట్టమన్నట్లుంది.. పంచాయతీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు. ఆర్థికసంఘం నిధులన్నీ మళ్లించేసి.. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలంటూ లక్ష్యాలు విధిస్తే ఎలా..? ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన 'జగనన్న స్వచ్ఛ సంకల్పం' కార్యక్రమం ఆచరణలో విఫలమవడానికి ప్రభుత్వ నిర్వాకమే ప్రధాన కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

Jagananna Swachh Sankalpam Program Failed
Jagananna Swachh Sankalpam Program Failed

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 29, 2023, 8:23 AM IST

Jagananna Swachh Sankalpam Program Failed: పేరుకే 'జగనన్న స్వచ్ఛ సంకల్పం'.. ప్రభుత్వం తీరుతో మురికివాడలుగా మారుతున్న గ్రామాలు

Jagananna Swachh Sankalpam Program Failed: గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణకు నిధుల్లేక పంచాయతీలు చేతులెత్తేశాయి. కార్మికులకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేకపోతున్నాయి. మలాథియాన్ సమకూర్చే అవకాశం కూడా లేక అనేక పంచాయతీల్లో ఫాగింగ్ యంత్రాలు సైతం మూలన పడ్డాయి. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి చూపించామని గొప్పగా చెప్పుకునే సీఎం జగన్.. జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు తన చుట్టూ కట్టిన పరదాలను దాటి లోపలికి వెళితే గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థలు తెలుస్తాయి.

జగనన్న స్వచ్ఛ సంకల్పం (Jagananna Swachh Sankalpam) ఎంత ఘనంగా అమలవుతోందో తెలిసొస్తుంది. పారిశుద్ధ్య సమస్యలతో జనం డెంగీ, మలేరియా వంటి వివిధ జ్వరాల బారిన పడి ఎలా ఇబ్బంది పడుతున్నారో.. కళ్లకు కడుతుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో 2021 అక్టోబరు 2వ తేదీన జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ప్రారంభమైంది. అన్ని పంచాయతీల్లోనూ ప్రతి సంవత్సరం వంద రోజులపాటు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలన్నది ప్రధాన ఉద్దేశం.

Sanitation in state : ఏదీ మురుగునీటి శుద్ధి..? జగన్‌ పాలనలో లోపించిన చిత్త'శుద్ధి'.. యథేచ్ఛగా నదుల్లోకి విడుదల!

కార్మికులపాలిట శాపం: ప్రజల భాగస్వామ్యంతో వీధులు, కాలువలను శుభ్రం చేయించడం, దోమల నియంత్రణకు ఫాగింగ్ నిర్వహణ వంటి అనేక పనులు చేపట్టేలా ప్రత్యేక మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. పంచాయతీలపై ఒత్తిడి తెచ్చి తొలి ఏడాది అధికారులు ఏదోవిధంగా మమా అనిపించారు. ఆ తర్వాత నిధుల సమస్యతో రెండో ఏడాది నుంచి పంచాయతీలు చేతులెత్తేశాయి. పంచాయతీల్లో 1993లో నియమితులైన దాదాపు 500 మంది పారిశుద్ధ్య కార్మికులకు దాదాపు రెండు సంవత్సరాలుగా వేతనాల్లేవు. మినిమం టైం స్కేల్ ఉద్యోగులుగా ఖజానాశాఖ నుంచే జీతాలిచ్చేవారు. 2019లో 020 పద్దు కింద జీతాలు చెల్లించేలా ప్రభుత్వం చేసిన సవరణలు కార్మికులపాలిట శాపమయ్యాయి.

నిరుపయోగంగా ఫాగింగ్ యంత్రాలు: అసలే ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న పంచాయతీలు వారికి జీతాలు సరిగా ఇవ్వడం లేదు. పంచాయతీకి ఒకటి చొప్పున కేటాయించిన 13 వేలకుపైగా ఫాగింగ్ యంత్రాల్లో అత్యధికంగా నిరుపయోగంగానే మారాయి. వీటిని ఉపయోగించాలంటే మలాథియన్, డీజిల్/ పెట్రోల్ అవసరం. నెలలో కనీసం 15 నుంచి 20 రోజులు ఉపయోగించినా 10 వేలకు పైనే ఖర్చవుతుంది. నిర్వహణ భారంతో పంచాయతీలు వీటిని పక్కన పడేశాయి. ఏజెన్సీ మండలాల్లో ఇప్పటికీ బయటకే తీయలేదు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల్లో ఫాగింగ్ యంత్రాలు వాడిన కొద్ది సేపటికే వేడెక్కి మంటలు రావడంతో కొన్ని చోట్ల పక్కన పెట్టారు.

Concern of auto drivers : 'ముఖ్యమంత్రి గారూ.. మాట నిలబెట్టుకోరా? స్వచ్ఛ ఆటో డ్రైవర్ల అవస్థలెన్నో..'

గ్రామాల్లో సేకరించిన చెత్తను తరలించేందుకు పంచాయతీకి 2 నుంచి 3 చొప్పున కేటాయించిన 23 వేల ట్రై సైకిళ్లు అత్యధిక చోట్ల మూలన పడ్డాయి. చిన్నాచితక మరమ్మతులను కార్మికులే సొంత డబ్బుతో చేయించేవారు. టైర్లు దెబ్బతినడం, రిమ్ములు మార్చాల్సి రావడంతో పంచాయతీలు చేతులెత్తేశాయి. ఉమ్మడి ఉభయ గోదావరి, ప్రకాశం, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో సైకిళ్లు తుప్పల్లో పడి ఉన్నాయి. మండల కేంద్రాల్లో చెత్త సేకరణకు కేటాయించిన వాహనాలు కూడా అత్యధిక చోట్ల మూలకు చేరాయి. ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల్లో చాలా చోట్ల మరమ్మతులకు నోచుకోక పక్కన పడేశారు.

CLAP Vehicle Drivers Protests అరకొర జీతాలతో బతకలేకపోతున్నాం.. హామీలు నెరవేర్చండి మహాప్రభో!: చెత్త సెకరించే వాహన డ్రైవర్లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details