ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోరుముద్ద సరుకులపై సందిగ్ధం...లక్షల మంది విద్యార్థుల ఎదురుచూపులు - jagananna gorumudda scheme news

కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలు పూర్తి స్థాయిలో తెరచుకోలేదు. దీంతో విద్యార్థులకు డ్రైరేషన్​ అందించాలని ప్రభుత్వం యోచించింది. జగనన్న గోరుముద్ద పథకం కింద కొన్ని నెలలు పంపిణీ జరిగింది. నవంబరులో 9, 10తరగతులు మొదలయ్యాయి. బడికి రాని వారికి డ్రైరేషన్​ ఇంటికి అందించేందుకు మళ్లీ సన్నాహాలు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని పాఠశాల్లో 3.52 లక్షల మంది అర్హులున్నట్లు గుర్తించారు.

jagananna gorumudda
గోరుముద్ద సరుకులు

By

Published : Dec 8, 2020, 11:47 AM IST

రోనా నేపథ్యంలో ఇప్పటికీ ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా తెరుచుకోలేదు. దీంతో ప్రభుత్వం సర్కారీ పాఠశాలల విద్యార్థులకు జగనన్న గోరుముద్ద పథకం కింద డ్రైరేషన్‌ అందజేయాలని సూచిస్తోంది. లాక్‌డౌన్‌ అమల్లో ఉండగా ఆగస్టు వరకు పంపిణీ చేశారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. సెప్టెంబరు నుంచి నవంబరు వరకు వాటిని అందజేయాలని యంత్రాంగం భావిస్తున్నా కీలకమైన కందిపప్పును టెండర్లు పిలిచి కొనుగోలు చేయాలా లేక జిల్లా కొనుగోళ్ల కమిటీ సూచించిన సంస్థల నుంచి సమీకరించుకోవాలా అనే దానిపై సరైన స్పష్టత లేదు. మధ్యాహ్న భోజన యంత్రాంగం ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక అయోమయంలో ఉన్నారు. 3.52 లక్షల మంది విద్యార్థులు డ్రైరేషన్‌కు అర్హులు. వీరంతా అవి ఎప్పుడు అందుతాయా అని ఎదురుచూస్తున్నారు. నవంబరులో 9, 10 తరగతులు ప్రారంభం కావడంతో వారిలో కూడా చాలా మంది పిల్లలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తినడం లేదు. తిన్నవారిని మినహాయించి తినని వారందరికి ఇవ్వడానికి యంత్రాంగం అంచనాలు తయారు చేసింది. సెప్టెంబరు నుంచి నవంబరు దాకా మూడు నెలలకు సరిపడా కందిపప్పు కొనుగోలుకే రూ.13.46 కోట్లు అవుతుందని అంచనాలు రూపొందించారు.

గుంటూరు జిల్లాలో 3530 పాఠశాలల్లో 1-10 చదివే విద్యార్థులు అందరూ కలిపి 3.52 లక్షల మంది ఉన్నారు. వారికి బియ్యం, కందిపప్పు, కోడిగుడ్లు, చిక్కీలు అందించాల్సి ఉంది. బియ్యం పౌరసరఫరాల శాఖ నుంచి అందుతాయి. కోడిగుడ్లు, చిక్కీలు టెండర్ల ద్వారా ఇప్పటికే సమకూర్చుకుంటున్నారు. కీలకమైన కందిపప్పును ప్రస్తుతం ఎలా సమకూర్చుకుని ఇవ్వాలో మధ్యాహ్న భోజన పర్యవేక్షణ యంత్రాంగానికి స్పష్టత కరవైంది. పొరుగున ఉన్న కృష్ణా జిల్లాలో టెండర్ల ద్వారా కందిపప్పు సమీకరించుకుంటున్నారు.

8-10 విద్యార్థులు తినకున్నా..

9, 10 తరగతులు నవంబరులో, 8వ తరగతి క్లాసులు డిసెంబరులో ప్రారంభమయ్యాయి. వీరిలో మధ్యాహ్న భోజనం తిననివారికి డ్రైరేషన్‌ అందజేయాలనే ఆదేశాలు ప్రభుత్వం నుంచి ఉన్నాయి. పిల్లల్లో ఎవరు తినటం లేదో ప్రధానోపాధ్యాయులు గుర్తించి వారికి ఆయా సరకులు ఎంత పరిమాణంలో వస్తాయో లెక్కలుగట్టే పనుల్లో ఉన్నారు. డ్రైరేషన్‌ను ప్యాకింగ్‌ చేసి ఇవ్వాల్సి ఉండడంతో ఆ ఖర్చులు కలిపి టెండర్‌ ఖరారు చేయాల్సి ఉంటుంది. జేసీ ఆధ్వర్యంలోనే టెండర్ల ప్రక్రియను నిర్వహించాలనే యోచనలో విద్యాశాఖ యంత్రాంగం ఉంది.

ఇదీ చదవండి:

'రైతు సంక్షేమంతోనే ఆహార భద్రత'

ABOUT THE AUTHOR

...view details