ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Jagan Met Union Minister for Polavaram Project Funds: పోలవరం తాజా అంచనాలను ఆమోదించండి.. కేంద్ర ఆర్థికమంత్రికి జగన్‌ విజ్ఞప్తి - Jagan met with Modi

Jagan Met Union Minister for Polavaram Project Funds: సీఎం జగన్‌కు ఆకస్మాత్తుగా దిల్లీ పర్యటనకు వెళ్లడంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిధులకోసం కేంద్ర ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేయడం చర్చానీయాంశంగా మారింది.

polavaram_project_funds
polavaram_project_funds

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 6, 2023, 7:27 AM IST

Updated : Oct 6, 2023, 9:46 AM IST

Jagan Met Union Minister for Polavaram Project Funds: పోలవరం తాజా అంచనాలను ఆమోదించండి.. కేంద్ర ఆర్థికమంత్రికి జగన్‌ విజ్ఞప్తి

Jagan Met Union Minister for Polavaram Project Funds:ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్‌కు ఆకస్మాత్తుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గుర్తొచ్చింది. నాలుగున్నర కాలంలో ప్రాజెక్టు గురించి కనీసం పట్టించుకోని జగన్‌ తీరా పదవీ కాలం ముగిసే సమయానికి పోలవరం తాజా అంచనాలకు ఆమోదం తెలపాలంటూ కేంద్ర పెద్దలను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు.

CM Jagan Delhi Tour ఒక్కొక్కరుగా హస్తినకు.. సీఎం దిల్లీ పర్యటనలో ఏం జరిగేనో..!

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 2017-18 ధరల ప్రకారం 55 వేల 548.87 కోట్ల రూపాయలకు సాంకేతిక సలహా మండలి ఇప్పటికే ఆమోదం తెలిపినందున.. దానిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు. దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిని గురువారం సాయంత్రం సీఎం జగన్‌ కలిశారు. పోలవరం ప్రాజెక్టు (Polavaram project) పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అడ్‌హాక్‌గా 12 వేల 911.15 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపినందుకు సంతోషంగా ఉందని.. అయితే దాన్ని పునఃపరిశీలించి తాజా అంచనాలు రూపొందించామని కేంద్రమంత్రికి వివరించారు.

Devineni Uma Serious Allegations: కృష్ణా జలాలు తెలంగాణకు తాకట్టు.. ఎన్నికల కోసం రూ.1200కోట్లు తీసుకున్న సీఎం జగన్ : టీడీపీ

లైడార్‌ సర్వే ప్రకారం అదనంగా 36 కుటుంబాలను రక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉందన్నారు. గతేడాది జులైలో వచ్చిన భారీ వరదల వల్ల తలెత్తిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తొలిదశ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేయాల్సిన పనులకు సంబంధించి ఈ అంచనాలు రూపొందించామని కేంద్ర మంత్రికి తెలిపారు. పోలవరం తొలి దశ పూర్తికి ఇంకా 17 వేల 144.06 కోట్లు అవసరమవుతాయని ఆ మొత్తాన్ని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 1,355 కోట్లను తిరిగి చెల్లించాలని కోరారు. కేంద్ర విద్యుత్‌ శాఖమంత్రి ఆర్‌కే సింగ్‌తోనూ ముఖ్యమంత్రి జగన్‌ సమావేశమయ్యారు. తెలంగాణ నుంచి రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్‌ బకాయిలు 7 వేల 359 కోట్లను ఇప్పించాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు.

Jagan Govt cut the Welfare Schemes for Contract Workers: చిరుద్యోగులపై దొంగదెబ్బ.. జీతాలు పెంచి పథకాలు కట్ చేసిన జగన్ సర్కార్

పెద్ద మొత్తంలో ఉన్న నిధుల బకాయిలు ఏపీ జెన్‌కో, డిస్కంలకు గుదిబండల్లా మారాయని వివరించారు. 30 రోజుల్లోగా ఏపీకి బకాయిలు చెల్లించాలంటూ గతేడాది ఆగస్టు 29న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా.. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) హైకోర్టును ఆశ్రయించిందన్నారు. ఈ అంశం ఇప్పుడు న్యాయ వ్యవస్థ పరిధిలోకి వెళ్లిందని, తెలంగాణ నుంచి ఆ నిధులు వచ్చేలా చూడాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆధ్వర్యంలో నేడు జరిగే సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొననున్నారు. సమీక్ష అనంతరం అమిత్‌ షాతో ముఖ్యమంత్రి జగన్‌ సమావేశమవుతారని తెలుస్తోంది.

Last Updated : Oct 6, 2023, 9:46 AM IST

ABOUT THE AUTHOR

...view details