ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Jagan Govt cut the Welfare Schemes for Contract Workers: చిరుద్యోగులపై దొంగదెబ్బ.. జీతాలు పెంచి పథకాలు కట్ చేసిన జగన్ సర్కార్ - టీడీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు

Jagan Govt cut the Welfare Schemes for Contract Workers మైకు దొరికిందంటే చాలు పథకాలు సంతృప్తికర స్థాయిలో అమలు చేస్తున్నామని, కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామంటూ.. గొంతెత్తి చెబుతుంటారు సీఎం జగన్. పేదరికాన్నే కొలమానంగా తీసుకుని అమలు చేస్తున్నామని గొప్పలు చెబుతుంటారు. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఒక చేత్తో ఇచ్చినట్టే ఇచ్చి నిబంధనల పేరుతో మరో చేత్తో ప్రభుత్వం లాగేసుకుంటోంది. పొరుగు సేవల ఉద్యోగులకు కేవలం 3వేల రూపాయలు వేతనం పెంచి.. వారికి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలన్నింటిలో కోత విధించింది.

contract_workers
contract_workers

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 4, 2023, 7:31 AM IST

Updated : Oct 4, 2023, 8:05 AM IST

YCP Govt Reduced Welfare Schemes for Contract Workers:పాదయాత్ర సమయంలో కాంట్రాక్ట్‌ సిబ్బందిని రెగ్యులరైజ్‌ చేస్తామని ప్రగల్భాలు పలికిన జగన్.. అధికారంలోకి వచ్చాక వాటిని మరిచిపోయారు. పొరుగు సేవల సిబ్బంది(Outsourcing Employees) వేతనాలు నామమాత్రంగా పెంచి సంక్షేమ పథకాలకు(Welfare Schemes) కోతేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల పరిధిలో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగులుసుమారు 2 లక్షల 40 వేల మంది. వీరి మేలు కోసమే ఆప్కాస్‌ను తెచ్చినట్లు జగన్‌ చెప్పారు. వీరిలో దాదాపు లక్ష మందిని ఆ సంస్థ పరిధిలోకి తీసుకున్నారు. ఆప్కాస్‌ పరిధిలోకి తీసుకున్న వారి వేతనాలను సీఎఫ్‌ఎంఎస్‌కు అనుసంధానించి వారి వివరాలన్నీ చేజిక్కించుకున్నారు. ఇంకేముంది పథకాలు కోత వేయడం మొదలుపెట్టారు.

How CM Jagan Cheating AP People: పథకాల్లో 'కోతలు'.. ప్రసంగాల్లో 'కోతలు'.. పెత్తందారు 'ఎవరు' జగన్​?..

ఎందుకు పథకాలు తీసేశారని వారిలో ఎవరైనా అడిగితే.. సీఎఫ్‌ఎంఎస్‌(CFMS)లోకి తెచ్చాం కదా? ఇక ప్రభుత్వ ఉద్యోగుల కేటగిరిలోకి వచ్చినట్లే అని అధికార వర్గాల నుంచి వచ్చిన సమాధానం విని అవాక్కవడం వారి వంతైంది. అలాగని ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించేవన్నీ పొరుగు సేవల వారికి ఇస్తున్నారా..? అంటే అదీలేదు. మరి కొందరు అధికారులైతే 3 వేలు వేతనం పెరగడం వల్ల ఆదాయం 12 వేలు మించింది కదా.? పథకాలకు అమలు చేసే ఆదాయ పరిమితిని దాటేసినట్టే. ఇక పథకాలు అందవు అని చెప్పడం విని పొరుగు సేవల సిబ్బంది విస్తుపోయారు.

Outsourcing Employees Agitation: 'తొమ్మిది నెలలుగా జీతాలు లేవు.. ఇంకెన్నాళ్లు వేచి చూడాలి..?'

Contract Employees Salaries in TDP Govt:పొరుగు సేవల ఉద్యోగులకు టీడీపీ ప్రభుత్వంలో వేతనాలను గణనీయంగా పెంచింది. గతంలో 6వేల 700 రూపాయలు, 8 వేల 400 రూపాయలు, 10 వేల 600, 12 వేల 600 ఇలా నాలుగు విభాగాలుగా వేతనాలు పొందేవారు. ఇందులో 6 వేల 700 తీసుకుంటున్న వారి వేతనాన్ని 12 వేలకు, ఆ తర్వాత కేటగిరీల వారీ వేతనాలను 15 వేలు, 18 వేలకు పెంచింది. వాస్తవానికి అప్పుడు కూడా పెంచాల్సిన దాని కంటే పెంపు 1000 తక్కువే జరిగినా దాదాపుగా 79 శాతం మేర పెంచింది. అంత పెంచినా అప్పట్లో వారికి అందే ఏ సంక్షేమ పథకాన్నీ తీసేయలేదు. రేషన్‌ కార్డు ప్రాతిపదికనే పథకాలను టీడీపీ ప్రభుత్వం అమలు చేసింది. కానీ జగన్‌ వేతనాలను సగటున 3వేల 200 చొప్పున అంటే 25శాతం మేర పెంచి వారికి సంక్షేమ పథకాలు దక్కకుండా చేశారు. అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, విద్యాకానుక, కాపు నేస్తం, చేయూత వంటి పలు పథకాలు పొరుగు సేవల ఉద్యోగుల కుటుంబాలకు లేకుండా చేశారు. ఆ కుటుంబాల నోట్లో మట్టి కొట్టారు.

Contract Employees Protest: "సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సిందే.. నిరవధిక సమ్మెకు సిద్ధం"

పొరుగు సేవల ఉద్యోగులకు వచ్చే వేతనం వారి కుటుంబ పోషణకు సైతం సరిపోవడం లేదు. అవివాహితులకు పిల్లనిచ్చే వారే కరవయ్యారు. వచ్చే 15వేలతో భార్యను, తల్లీదండ్రులను ఎలా పోషిస్తావని ముఖం మీదే చెప్పి వెళ్లిపోతున్నారు. ఎన్నికలకు ముందు ఒప్పంద సిబ్బందితో పాటు పొరుగు సేవల సిబ్బందిని కూడా రెగ్యులరైజ్‌ చేస్తానని అసెంబ్లీ సాక్షిగా మాటిచ్చిన జగన్‌.. రెగ్యులరైజ్‌ అనే మాటను పక్కనపెట్టి వేతనాలు నామమాత్రంగా పెంచి దానికి సరిపడా సంక్షేమ పథకాలు కోత వేసి లెక్క సరిచేశారు. దీనిపై ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ జేఏసీ మండిపడింది. న్యాయం చేయాలని లేకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించింది.

Jagan Govt cut the Welfare Schemes for Contract Workers: చిరుద్యోగులపై దొంగదెబ్బ.. జీతాలు పెంచి పథకాలు కట్ చేసిన జగన్ సర్కార్
Last Updated : Oct 4, 2023, 8:05 AM IST

ABOUT THE AUTHOR

...view details