ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గెలిపించండి.. మద్యాన్ని నిషేధించాకే ఓట్లడుగుతా!

'వైకాపా అధికారంలోకి వస్తే మద్యపానాన్ని నిషేధించాకే మళ్లీ ఓట్లు అడగానికి వెళ్తా. లా అండ్‌ ఆర్డర్‌ కాపాడతాను. ‘లా'ను తీసుకొస్తాను.. ఆర్డర్‌లోనూ పెడతాను' –చిలకలూరిపేటలో వైకాపా అధినేత జగన్​

చిలకలూరిపేటలో పార్టీ గుర్తును చూపుతున్న జగన్

By

Published : Mar 24, 2019, 6:07 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన రోడ్​షోలో మహిళలకు ప్రతిపక్ష నేత జగన్ హామీల వర్షం కురిపించారు. వైకాపా అధికారంలోకి వస్తే... ప్రభుత్వం అందించే జీ ప్లస్ త్రీ ఫ్లాట్లపై ఉన్న రుణాలను.. ఎన్నికల నాటికి వరకు డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామన్నారు. వీటితో పాటు వడ్డీ లేని రుణాలను పొదుపు సంఘాలకు అందిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్​ఆర్ చేయూత పథకం ద్వారా 45 సంవత్సరాలు నిండిన మహిళలకు 4 దఫాల్లో 75 వేల రూపాయలు అందిస్తామన్నారు. పిల్లల్ని బడికి పంపిస్తే తల్లికి సంవత్సరానికి 15 వేల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంజనీరింగ్, డాక్టర్ కోర్సులు చేసే విద్యార్థులకు మెస్ ఛార్జీల కింద ఏడాదికి 20వేల రూపాయలు అందిస్తామని తెలిపారు. మద్యపానాన్ని 3 దఫాల్లో.. 5 సంవత్సరాలలోపు నిషేధిస్తామని హామీ ఇచ్చారు. అలా చేస్తేనే మళ్లీ ఓట్లు అడుగుతానని భరోసా ఇచ్చారు. ఆడవాళ్లపై దాడులు తగ్గేందుకు చట్టాలను కఠినతరం చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details