ప్రజా ప్రతినిధులే ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అమరావతి పరిరక్షణ ఐకాస నాయకులు, తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, మహిళలపై దాడికి పాల్పడిన ఎంపీ నందిగం సురేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను రెచ్చగొట్టేలా చేసి.. తిరిగి వారిపైనే కేసులు బనాయించడం దారుణమని జేఏసీ కన్వీనర్ శ్రీనివాసరావు మండిపడ్డారు. ఎంపీ సురేష్, ఎమ్మెల్యే శ్రీదేవి చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. ఎస్సీలను కించపరిచేలా ఎంపీ సురేష్ వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు.
ఎంపీ సురేష్‌పై చర్యలు తీసుకోవాలని ఐజీ బ్రిజ్‌లాల్‌కు అమరావతి ఐకాస వినతి - గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్ లాల్‌కు వినతి పత్రం అందజేసిన ఐకాస నాయకులు
రైతులు, మహిళలపై దాడిని నిరసిస్తూ ఎంపీ నందిగం సురేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ అమరావతి పరిరక్షణ ఐకాస నాయకులు తెదేపా నేతల ఆధ్వర్యంలో గుంటూరు రేంజ్ ఐజీకి వినతి పత్రం అందజేశారు. ప్రజా ప్రతినిధులే ఎస్సీ, ఎస్టీ చట్టాలను దుర్వినియోగం చేయడం తగదని తెదేపా నేతలు అన్నారు.
గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్ లాల్‌కు వినతి పత్రం అందజేసిన ఐకాస నాయకులు