ఎంతో ఘన చరిత్ర కలిగిన పల్నాడును జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ... పల్నాడు సాధన జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట సంకల్ప దీక్ష చేపట్టారు. జిల్లాగా ప్రకటించాలని జేఏసీ నాయకులు నినాదాలు చేశారు. జిల్లా కేంద్రం ఏర్పాటే లక్ష్యంగా పార్టీలకతీతంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడినట్లు జేఏసీ సభ్యులు గుంటుపల్లి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ ప్రాంతం ఇంకా వెనుకబడే ఉందని... ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనలో పల్నాడు జిల్లా కేంద్రంగా ప్రకటించి ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం దోహదపడాలని కోరారు.
పల్నాడును జిల్లా కేంద్రంగా ప్రకటించాలి: జేఏసీ - guntur latest news
పల్నాడును జిల్లా కేంద్రంగా ప్రకటించాలని పల్నాడు సాధన జేఏసీ డిమాండ్ చేసింది. జిల్లా కేంద్రంగా ప్రకటించి ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం దోహదపడాలని నినాదాలు చేశారు. ఈ మేరకు జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట సంకల్ప దీక్ష చేపట్టారు.

పల్నాడును జిల్లా కేంద్రంగా ప్రకటించాలి: జేఏసీ