వేతనాలు చెల్లించాలని కోరుతూ... గుంటూరు జిల్లా బాపట్లలో వలస కూలీలు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారి రోడ్డు పనుల నిమిత్తం బీఎస్సీపీఎల్ ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులు బీహర్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి వలస కూలీలను తీసుకువచ్చారు.
జాతీయ రహదారిపై వలస కూలీల ఆందోళన
గుంటూరు జిల్లా బాపట్లలో వలస కూలీలు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. బీఎస్సీపీఎల్ ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులు వేతనాలు చెల్లించటంలేదని నిరసనకు దిగారు.
వారికి నాలుగు నెలలుగా భోజనం పెట్టకపోగా... వేతనాలు చెల్లించటం లేదంటూ కార్మికులు ఆందోళన బాటపట్టారు. రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినకపోవటంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
TAGGED:
VALASA KULILA DHARNA