సీఎంఆర్ఎఫ్కు ఐటీసీ రూ.2 కోట్లు విరాళం
కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సంస్థలు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. ఇదే బాటలో ఐటీసీ రూ.2 కోట్ల సీఎంఆర్ఎఫ్కు విరాళమిచ్చింది. ఇవాళ ముఖ్యమంత్రి జగన్ని కలిసి చెక్కును అందజేశారు ఆ సంస్థ ప్రతినిధులు.
itc donates 2 crore rupees to cmrf
కరోనా నివారణ, సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఐటీసీ లిమిటెడ్ రూ.2 కోట్ల విరాళం అందించింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసి ఐటీసీ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు చెక్కును అందజేశారు. అలాగే ముఖ్యమంత్రి సహాయనిధికి చెన్నైకి చెందిన మేడగం రాజశేఖర్ రెడ్డి రూ.5 లక్షల విరాళం ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్కును సీఎం జగన్కు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇచ్చారు.