జాతీయస్థాయి వైద్యవిద్య ప్రవేశ పరీక్ష.. నీట్లో ర్యాంకు రావాలంటే కఠోర శ్రమతో పాటు ఏకాగ్రత అవసరం. పట్టుదలకు తోడు తగిన కార్యాచరణ, సన్నద్ధత, సమయపాలన, అంశాల వారీగా అధ్యయనం లాంటి ఆయుధాలు ఎన్నో అవసరం అవుతాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే పరీక్షల్లో వాటిని అమలు చేస్తూ రాయడం మరో ఎత్తు. ఇన్ని సవాళ్లను అధిగమించి నీట్లో జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో ఆరో ర్యాంకు, రాష్ట్రంలో టాపర్గా నిలిచింది గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చైతన్య సింధు.
ప్రణాళికబద్ధంగా చదివితే చాలు.. ర్యాంక్ వస్తుంది: చైతన్య సింధు - face to face interview with sindhu
నీట్లో ర్యాంకు రావాలంటే ప్రణాళికబద్ధమైన అధ్యయనం కీలకపాత్ర పోషిస్తుందని నీట్ ఏపీ టాపర్ చైతన్య సింధు వెల్లడించారు. అనవసర భయాన్ని వీడి చదివింది.. ప్రణాళికాబద్ధంగా కష్టపడితే విజయం వరిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు.
ప్రణాళికబద్ధంగా చదివితే చాలు.. ర్యాంక్ వస్తుంది : చైతన్య సింధు
వైద్య కుటుంబం నుంచి..
వైద్యుల కుటుంబం నుంచి వచ్చిన చైతన్య సింధు.. పరీక్షలకు అనవసర భయాన్ని వీడాలని.. ప్రణాళికాబద్ధంగా కష్టపడితే ర్యాంకు సాధించవచ్చంటున్న చైతన్య సింధుతో ఈటీవీ భారత్ ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి.