ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బీసీల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: చంద్రబాబు - స్థానిక సంస్థల ఎన్నిలపై హైకోర్టు తీర్పు

బీసీల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న విషయం స్థానిక సంస్థల్లో 59 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో స్పష్టమైందని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల విషయంలో సమర్థుడైన న్యాయవాదిని పెట్టకుండా కేసును నీరుగార్చిందని ఆరోపించారు.

తెదేపా అధినేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు

By

Published : Mar 2, 2020, 7:12 PM IST

స్థానిక సంస్థల్లో 59 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో.. బీసీల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న విషయం స్పష్టమైందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలతో సమావేశమైన ఆయన... కోర్టు తీర్పుపై చర్చించారు. రైతులకు అన్యాయం చేసేందుకు న్యాయవాదికి రూ.5 కోట్లు ఖర్చు పెట్టడానికి సైతం వెనుకాడని ప్రభుత్వం... రిజర్వేషన్ల విషయంలో మాత్రం సమర్థుడైన న్యాయవాదిని పెట్టకుండా కేసును నీరుగార్చిందని ఆరోపించారు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని, అప్పుడు తెదేపా సైతం కేసులో ఇంప్లీడ్‌ అవుతుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details