ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 7, 2022, 3:15 PM IST

ETV Bharat / state

అభ్యంతరాలుంటే చెప్పండి.. తెరాస పేరు మార్పుపై బహిరంగ ప్రకటన

Public Notice on TRS party Name Change: తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్పుపై బహిరంగ ప్రకటన జారీ చేశారు. పార్టీ అధ్యక్షుని పేరిట పత్రికల్లో ప్రకటన జారీ అయింది. కొత్త పేరు పట్ల ఎవరికైనా, ఏదైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించాలని అందులో కోరారు.

Telangana Rashtra Samithi
తెలంగాణ రాష్ట్ర సమితి

Public Notice on TRS party Name Change: తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్పుపై బహిరంగ ప్రకటన జారీ చేశారు. పార్టీ అధ్యక్షుని పేరిట పత్రికల్లో ప్రకటన జారీ అయింది. పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ అక్టోబర్ 5వ తేదీన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ ప్రతిని తెరాస సీనియర్ నేత వినోద్ నేతృత్వంలోని బృందం అక్టోబర్ 6వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి అందించింది. ఈసీ నిబంధనల ప్రకారం పార్టీ పేరు మార్పునకు సంబంధించి అభ్యంతరాలు స్వీకరించాల్సి ఉంటుంది.

ఇందుకోసం సదరు పార్టీ స్థానిక, ఆంగ్ల పత్రికల్లో ప్రకటనలు జారీ చేయాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా తెరాస బహిరంగ ప్రకటన జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చడానికి ప్రతిపాదిస్తున్నట్లు అందులో పేర్కొంది. కొత్త పేరు పట్ల ఎవరికైనా, ఏదైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించాలని అందులో కోరారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని పరిశీలించిన అనంతరం పేరు మార్పు ప్రతిపాదన విషయమై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుంది.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details