గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం పేరలిపాడులో అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. తమ్ముడు జూలియన్పై సొంత అన్న యెహోను కల్లు గీసే కత్తితో దాడి చేశాడు. గాయపడిన అతడిని బంధువులు బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందాడని వైద్యులు తెలిపారు. పోలీసులు వివరాలను నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అన్నదమ్ముల మధ్య ఘర్షణ... తమ్ముడు మృతి - గుంటూరు జిల్లా తాజా మరణ వార్తలు
అన్నదమ్ముల మధ్య నెలకొన్న వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ గొడవలో తమ్ముడు మృతి చెందారు. ఈ ఘటన గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం పేరలిపాడులో జరిగింది.
issue between brothers younger brother died in guntur dst