శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గుంటూరులోని ఇస్కాన్ శ్రీరాధాకృష్ణచంద్ర మందిరంలో 2వరోజు ఉట్టి మహోత్సవం నయనమనోహరంగా, ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నారులు గోపబాలుడు, గోపికమ్మల వేషధారణలతో అలరించారు. హరే రామ నామస్మరణతో ఉట్టి మహోత్సవం కార్యక్రమాన్ని ఇస్కాన్ టెంపుల్ ఛైర్మన్ రాం మురారీ దాస్ ప్రారంభించారు. ఎక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడో ఆ ప్రాంతమంతా ఆనందమయంతో... పిల్లపాపలతో కళకళలాడుతుందని తెలిపారు. గుంటూరు చుట్టుపక్కల ఇంత ఘనంగా ఉట్టి మహోత్సవం మరెక్కడా జరగదని వివరించారు.
కన్నుల పండుగగా కృష్ణాష్టమి వేడుకలు - utti
గుంటూరు ఇస్కాన్ శ్రీరాధాకృష్ణచంద్ర మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి.
కృష్ణాష్టమి