ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలలో వ్యవసాయ, ఉద్యాన శాఖ సిబ్బంది అక్రమాలకు(Irregularities in guntur Rythu bharosa centre) తెరలేపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో(prathipadu Rythu bharosa centre) తొమ్మిది రైతు భరోసా కేంద్రాల్లో అనుమతులు లేని వేప నూనె సీసాలను రైతులకు విక్రయించారు. మిరప పంటలో వచ్చిన తామర పురుగు, వైరస్ నివారణకు వేప నూనె పిచికారీ చేయాలనే శాత్రవేత్తల సూచనను ఆర్బికేల సిబ్బంది అక్రమార్జనకు మార్గంగా మలుచుకున్నారు.
గుంటూరులో అనుమతులు లేకుండా వేపనూనె తయారు చేస్తున్న శివనాగేశ్వరరావుతో ఒప్పందం కుదుర్చుకుని.. ఆ నూనె బాటిళ్లను పెద్ద ఎత్తున తీసుకువచ్చి రైతులకు విక్రయించారు. ఒక్కొక్క బాటిల్‌పై రూ.300 నుంచి 500 వందల వరకు లాభం చూసుకుని రైతులకు విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాటిల్ అసలు ధర రూ.999 గా ఉందని.. కానీ ప్రభుత్వం రాయితీ ఇచ్చినందువల్ల రూ.600 వరకు ఇస్తున్నామని చెప్పి, విక్రయించారు. తెలంగాణలోని వనస్థలిపురం, రంగారెడ్డి జిల్లాలోని ఎస్వీ ఆర్గానిక్స్ సంస్థ లేబుల్ తో డబ్బాలను ప్యాకింగ్ చేశారు.