ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Smart Meters: స్మార్ట్‌మీటర్ల పేరిట స్మార్ట్​గా దోచేస్తున్నారు... - purchase of smart meters

Purchase of smart meters: వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు.. ముట్టుకోకుండానే షాక్ కొడుతున్నాయి. కనీవినీ ఎరుగని విధంగా డిస్కంలు.. ఒక్కోమీటరు ఏర్పాటు, ఐదేళ్ల పాటు నిర్వహణకు సుమారు 35వేల రూపాయలు చొప్పున వెచ్చించనున్నట్టు సమాచారం. ఆ ధరలు చూసి విద్యుత్‌రంగ నిపుణులు దిగ్భ్రాంతి చెందుతున్నారు. అది ముమ్మాటికీభారీ కుంభకోణమని, ఈ పేరుతో ప్రభుత్వ పెద్దలు భారీ దోపిడీకి సిద్ధ పడుతున్నారని ఆరోపిస్తున్నారు.

Smart meters
స్మార్ట్‌మీటర్లు

By

Published : Oct 24, 2022, 7:12 AM IST

స్మార్ట్‌మీటర్ల పేరిట స్మార్ట్​గా దోచేస్తున్నారు

Smart Meters in APవ్యవసాయ మోటర్లకు బిగించే స్మార్ట్‌మీటర్ల ధర దిమ్మతిరిగేలా చేస్తోంది. గతనెలలో ఇంధనశాఖ మంత్రి సమీక్ష కోసం డిస్కంలు అందజేసిన సమాచారం ప్రకారం స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు, ఐదేళ్ల నిర్వహణకు (ఎస్​పీడీసీఎల్ ) సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ లిమిటెడ్. పరిధిలో 3వేల 825 కోట్ల వ్యయంతో 11 లక్షల మీటర్ల ఏర్పాటుకు.. 2021 అక్టోబరు 10న షరతులతో కూడిన ఎల్‌ఓఏ జారీ చేసింది. అంటే ఒక్కో మీటరుకు, 34వేల 777 రూపాయలు వెచ్చిస్తున్నారు. సీపీడీసీఎల్ పరిధిలో 1,742 కోట్ల వ్యయంతో 5లక్షల మీటర్ల ఏర్పాటుకు 2021 సెప్టెంబరు 29న షరతులతో కూడిన ఎల్‌ఓఏ జారీ చేసింది. అక్కడ ఒక్కోమీటరుకు 34వేల 587 రూపాయల చొప్పున వెచ్చిస్తున్నారు.

ఏడాది క్రితమే గుత్తేదారు సంస్థలకు షరతులతో కూడిన లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు-ఎల్‌ఓఏ జారీ చేసినట్టు తెలుస్తోంది. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చక్రం తిప్పుతున్న కడప జిల్లాకు చెందిన ఒక కంపెనీ.. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. టెండర్ ప్రక్రియలో ఆ కంపెనీకి మేలు జరిగేలా అర్హత నిబంధనల్లో కొన్ని మార్పులు చేసినట్టు ఆరోపణలున్నాయి. డిస్కంలు కూడా స్మార్ట్‌మీటర్ల వ్యవహారంపై అత్యంత గోప్యత పాటిస్తున్నాయి. టెండర్లు ఎప్పుడు పిలిచారు? ఎంతమంది పాల్గొన్నారు? గుత్తేదారుగా ఎవర్ని ఖరారు చేశారు? వంటి వివరాల్ని, సమాచార హక్కు చట్టం కింద అడిగినా.. సీపీడీసీఎల్, ఈపీడీసీఎల్ నిరాకరించాయి. (ఎస్​పీడీసీఎల్ ) మాత్రం అరకొర సమాచారంతో సరిపెట్టింది.

రాష్ట్రప్రభుత్వం అదనపు అప్పుకోసమే వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చుతోంది. మోటార్లకు మీటర్లు అమర్చితే.. జీఎస్జీడీపీలో 0.5 శాతం రుణాన్ని అదనంగా పొందే వెసులుబాటు ప్రభుత్వానికి కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కేవలం మీటర్లు మాత్రమే పెట్టాలని చెప్పింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పతాక స్థాయికి తీసుకెళ్లి.. స్మార్ట్‌మీటర్ల పేరుతో భారీ వ్యయానికి రంగం సిద్ధం చేసింది.

విద్యుత్ పంపిణీ సంస్థలు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన సమయంలో, మూడు డిస్కంల పరిధిలో 18.61 లక్షల స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు సుమారు 6వేల173కోట్ల రూపాయలు వెచ్చించేందుకు సిద్ధపడటంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అది ముమ్మాటికీభారీ కుంభకోణమని, ఈ పేరుతో ప్రభుత్వ పెద్దలు భారీ దోపిడీకి సిద్ధ పడుతున్నారని.. విద్యుత్ రంగానికి సంబంధించిన అంశాలపై దీర్ఘకాలంగా పనిచేస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్. బాబూరావు ఆరోపించారు.

స్మార్ట్ మీటర్ల కోసం పెట్టే 38వేల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్న డిస్కంలకిస్తే, రుణ భారం కొంతైనా తగ్గించినట్లవుతుందన్నారు. ఒక్కోమీటరుకు 7వేలకు మించి ఖర్చవదని.. శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రాజెక్టు అమలు చేయడానికి.. ఒక్కొక్క మీటరు 6,000 నుంచి 7,000 మాత్రమే ఖర్చయిందని బాబురావు చెప్పారు. కానీ ఇప్పుడు ఒక్కో మీటరుకు స్మార్ట్ పేరుతో 35వేల రూపాయలు ఖర్చవుతుందని చెప్పడం..కుంభకోణం కాకపోతే మరేంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలు జేబులు నింపుకోవడానికే ఇదంతా చేస్తున్నాని అనుమానం వ్యక్తం చేశారు.
డిస్కంలు మొదట రూపొందించిన టెండర్ నిబంధనల ప్రకారం.. మీటర్ల సరఫరా, నిర్వహణ వ్యయాన్ని గుత్తేదారు సంస్థలే భరించాలి. ఆ మొత్తాన్ని డిస్కంలు ఆ తర్వాత వాటికి వాయిదాల్లో చెల్లిస్తాయి. ఇదే విధానంలో టెండర్లు పిలిచేందుకు డిస్కంలు మొదట న్యాయసమీక్షకు పంపి అనుమతి తీసుకు న్నాయి. తర్వాత గుత్తేదారులతో సంప్రదింపులు జరిపి, వారు కోరిన మేరకు నిబంధనల్లో మార్పులు చేశాయి. కొత్త నిబంధన ప్రకారం.,.డిస్కంలు ముందే చెల్లిస్తాయి. దీని వల్ల డిస్కంలపై ఆర్థిక భారం పడనుండగా, ముందే పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా గుత్తేదారులకు వెసులుబాటు లభిస్తుంది. గుత్తేదారులకు అనుకూలంగా అన్ని మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి?

ఆప్టికల్ పోర్టు కమ్యూనికేషన్, ఐఆర్డీఏ పోర్టు కమ్యూనికే షన్ మీటర్లలో ప్రామాణిక స్పెసిఫికేషన్లు ఒకేలా ఉంటాయి కాబట్టి.. ఆప్టికల్ పోర్టు కమ్యూనికేషన్ మీటర్ల అమరిక, టెస్టింగ్, కమిషనింగ్లో అనుభవం ఉన్నా సరిపోయేలా నిబంధన మార్చాలని వైఎస్సార్ జిల్లాకు చెందిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ చేసిన విజ్ఞప్తికి డిస్కంలు సానుకూలంగా స్పందించాయి. టెండర్లలో ప్రస్తావించిన మీటర్ల సంఖ్యలో..కనీసం 20 శాతం మీటర్లు అమర్చిన అనుభవం గతంలో ఉండాలన్న నిబంధనను 15 శాతానికి తగ్గించాలని ఆ సంస్థ చేసిన విజ్ఞప్తికీ అంగీకరించాయి. గుత్తేదారులు కోరిన విధంగా టెండరు నిబంధనలు మార్చేందుకు అనుమతి వ్వమని కోరుతూ 2021 జులైలో న్యాయ సమీక్ష కమిటీకి మూడు డిస్కంలు మళ్లీ విజ్ఞప్తి చేశాయి.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details