Irregularities In Guntur Voter List :గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ అరాచకాలకు తెగబడుతున్నారు. టీడీపీ కంచుకోట అయిన ఈ స్థానంలో 2019లో గిరిధర్ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత అధికార పార్టీలోకి చేరిన ఆయన ఇప్పుడు టీడీపీ ఓట్ల గల్లంతుకు గురిపెట్టారు. నాలుగున్నరేళ్ల వైసీపీ ప్రజావ్యతిరేక పాలనలో ఇక్కడ వైసీపీ గెలుపు సులభం కాదని భావించి అరాచకానికి వ్యూహం పన్నారు. తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేవారిని ఓటర్ల జాబితా నుంచి తప్పించేందుకు దందా సాగిస్తున్నారు.
Removal TDP Sympathizers Votes in AP :ప్రధానంగా ఒక సామాజికవర్గం ఓట్లు జాబితాలో లేకుండా తొలగించేందుకు పన్నాగాలు పన్నారు. మిగిలిన వర్గాల్లోనూ టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు స్కెచ్‌గీసి స్వయంగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు. 33వ డివిజన్‌లో ఎన్ని ఓట్లు తొలగించారని ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ దరఖాస్తులు చేసిన వారితో మాట్లాడిన వాట్సప్ చాటింగ్‌ను టీడీపీగుంటూరు పశ్చిమ ఇన్‌ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర బహిర్గతం చేశారు. డివిజన్లు, పోలింగ్ కేంద్రాల వారీగా ఓట్ల తొలగింపు దరఖాస్తుల పని ఎలా జరుగుతోందని ఎప్పటికప్పుడు వాట్సప్ ద్వారా చాటింగ్ చేసి ఎమ్మెల్యే ఆరా తీశారు. ఈ విషయాన్ని టీడీపీ నేతలు బయటపెట్టడంతో అడ్డంగా దొరికిపోయారు.
ఉంగుటూరులో అధికార పార్టీ అరాచకం, టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు యత్నం
Form 7 Issue Cases In Guntur :ఓట్ల తొలగింపునకు ఫారం-7 ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. టీడీపీ అభ్యర్థిగా గెలిచిన మద్దాళి గిరిధర్ పోలింగ్ కేంద్రాల వారీగా పార్టీల బలాబలాలపై సమాచారం సేకరించారు. 2019 ఫలితాల తర్వాత టీడీపీ మద్దతుదారుల వివరాలు రాబట్టారు. గతంలో ఒక్కరే వందల సంఖ్యలో ఫారం-7 దరఖాస్తులు సమర్పించేవారు. ఇప్పుడు వ్యూహం మార్చారు. ఒక్కొక్కరు అయిదు కంటే ఎక్కువ దరఖాస్తులు పెట్టకుండా జాగ్రత్తపడ్డారు. నవంబరులోనే 22వ తేదీ వరకు 3వేల 541 ఫారం-7 దరఖాస్తులు వచ్చాయి. ఇందులోనూ 5 కన్నా ఎక్కువ దరఖాస్తులు పెట్టినవారు 45 మంది ఉన్నారు. మొత్తం దరఖాస్తుల్లో ఇలా అయిదు కంటే ఎక్కువ దరఖాస్తులు పెట్టినవే 52 శాతం ఉన్నాయి. అంటే ఓట్ల తొలగింపునకు ఎంత కసిగా, ప్రణాళికతో వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది.