వేలాదిమంది వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు చేసే విద్యుత్ సిబ్బంది కరోనా కారణంగా కరెన్సీ నోట్లను ముట్టుకునేందుకు భయపడుతున్నారు.ఇందుకు పరిష్కారంగా గుంటూరులోని విద్యుత్ ఉద్యోగులు బిల్లుల చెల్లింపు కోసం వినియోగదారుల ఇచ్చే నోట్లను ఇస్త్రీ చేసి మరీ తీసుకుంటున్నారు. ఇస్త్రీ పెట్టెకుండే అధిక ఉష్టోగ్రత మూలంగా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేనందున ఉద్యోగులు ఈ మార్గాన్ని ఎన్నుకున్నారు.
కరెన్సీ నోట్లను ఇస్త్రీ చేసి తీసుకుంటున్న విద్యుత్ సిబ్బంది - iron to currency notes due to corona virus
కరోనా భయంతో కరెన్సీ నోట్ల తీసుకోడానికి ప్రజల భయపడుతున్నారు.ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో విద్యుత్ బిల్లులు చెల్లింపు కోసం వినియోగదారులు ఇచ్చే నోట్లను ఇస్త్రీ చేసి తీసుకుంటున్నారు.
కరెన్సీ నోట్లను ఇస్త్రీ చేసి తీసుకుంటున్న విద్యుత్ సిబ్బంది
TAGGED:
currency vs corona viurs