వచ్చే నెలలో ప్రారంభం కానున్న క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో భారత్ కే విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డారు. గుంటూరులో ఏర్పాటు చేసిన ఫ్యాన్ పార్కులో ప్రసాద్ హాజరై ఐపీఎల్ మ్యాచులను వీక్షించారు.
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లు దేశమంతటా అభిమానుల్ని ఊపేస్తున్నాయి. ఈ మ్యాచులను ప్రత్యక్షంగా చూడలేని అభిమానుల కోసం ఆరండల్ పేట పిచ్చుకల గుంట మైదానంలో బీసీసీఐ ఏర్పాటు చేసిన ఫ్యాన్ పార్కు కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు, యువకులు, మహిళలు...ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లను బిగ్ స్క్రీన్లపై తిలకించి సందడి చేస్తున్నారు.
ప్రపంచ కప్ అవకాశాలు మనకే ఎక్కువ: ఎమ్మెస్కే ప్రసాద్ - ఎమ్మెస్కే ప్రసాద్
ఐపీఎల్ మ్యాచ్లను పెద్ద తెరలపై వీక్షించేలా గుంటూరులో బీసీసీఐ ఏర్పాటు చేసిన ఫ్యాన్ పార్కుకు విశేష స్పందన లభిస్తోంది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్... క్రికెట్ అభిమానులతో కలిసి ఐపీఎల్ మ్యాచ్ను వీక్షించారు. ఈ సారి ప్రపంచ కప్ భారత్కు ఖాయమని దీమా వ్యక్తం చేశారు.
ప్రపంచ కప్ అవకాశాలు మనకే ఎక్కువ: ఎమ్మెస్కే ప్రసాద్