Nadendla Manohar Coments On YSRCP Government : వైఎస్సార్సీపీ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వీర మహిళల విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారిణి అరుణ, స్వచ్ఛంద సంస్థ నిర్వహకురాలు చిగురుపాటి విమలను నాదెండ్ల మనోహర్ ఘనంగా సన్మానించారు.
చట్ట సభలలో మహిళలకు కచ్చితంగా 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని మనోహర్ స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఎక్కడపడితే అక్కడ గంజాయి దొరకడం దురదృష్టకరమని అన్నారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలన్నారు. సామాజిక మాధ్యమాలలో వీర మహిళలపై అసభ్యకరంగా పోస్టులు, కామెంట్స్ పెడితే కఠినంగా శిక్షిస్తామని నాదెండ్ల మనోహర్ తీవ్రంగా హెచ్చరించారు. మహిళలకు ఎందుకు భద్రత ఇవ్వలేకపోతున్నామని, ఇటువంటి ప్రశ్నల గురించి మీరందరూ బలంగా మాట్లాడాలని ఆయన అన్నారు.
జనసేన రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
"మహిళలకు సమాన హక్కులు మనం కల్పించాలని ఉపాన్యాసాలకే పరిమితం కాకుండా.. పవన్ కల్యాణ్ ఈరోజు కూడా ప్రతి సభలో మహిళలకు 33 శాతం చట్టసభల్లో రిజర్వేషన్ తీసుకురావాలని ప్రతి సందర్భంలో గుర్తు చేస్తూ ఉంటారు. ఈరోజు గంజాయి ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు వెళ్లిపోయిందో మీరే చూడండి ఆశ్చర్యపోతారు. ముఖ్యమంత్రి గారి నివాసం దగ్గర ఒక బ్లైండ్ లేడి పైనా దాడి చేసి చంపేస్తే చాలా లైట్‌గా తీసుకున్నారు. ఎందుకు ఈ విధంగా పరిపాలన జరుగుతుంది? మహిళలకు ఎందుకు భద్రత ఇవ్వలేకపోతున్నాం? ఈ ప్రశ్నల గురించి మీరందరూ బలంగా మాట్లాడాలి. కచ్చితంగా లా అండ్ ఆర్ఢర్ అనేది ఒక ప్రధానమైన సమస్య. మహిళన్ని కించపరిచే విధంగా ఎక్కడైనా పోస్టులు పేడితే మాత్రం కచ్చితంగా జిల్లా ఎస్పీకి దగ్గరకు వెళ్లి కంప్లైట్ ఇవ్వమని పవన్ చెప్పారు. మహిళలకు భద్రత ఇస్తేనే మహిళలు చట్ట సభల్లో వెళ్లడానికో, రేపటి రోజున ఉన్నత విద్యలు అభ్యసించడానికో, ఇంకా చక్కగా ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకుని ధైర్యంగా తల్లిదండ్రులకు మనశ్శాంతి ఉండే విధంగా వాళ్లు కష్టపడి హాస్టల్స్‌లో ఉండి వాళ్లు ఉద్యోగాలు సంపాదించుకోని మరోక్క సారి వాళ్లు ఇంకొక కుటుంబాన్ని పోషించే విధంగా ఎదుగుతున్నారు" - నాదెండ్ల మనోహర్, జనసేన పీఏసీ ఛైర్మన్
ఇవీ చదవండి