మాతృభాషలో విద్య వ్యవస్థ ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుందని ఐక్యరాజ్యసమితి కూడా వెల్లడించిందని తెలుగు భాషోద్యమ సమాఖ్య జాతీయ అధ్యక్షుడు సామల రమేష్‌బాబు అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని.., అభివృద్ధి జరగాలంటే మాతృభాషలో విద్యా వ్యవస్థ ఉండాలని సూచించారు. కేంద్రీయ విద్యాలయ విశ్రాంత అధ్యాపకులు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విద్యా వ్యవస్థ మాతృభాషలో ఉన్నప్పుడే విద్యార్థులు అభివృద్ధి చెందుతారని స్పష్టం చేశారు.
తెనాలిలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం - లుగు భాషోద్యమ సమాఖ్య తాజా వార్తలు
గుంటూరు జిల్లా తెనాలి వీఎస్ఆర్ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు మేధావులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు.
తెనాలిలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం