గుంటూరు బొంగరాలబీడు మహాప్రస్థానంలో గురువారం మరో 53 మృతదేహాలకు ఆ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. గుంటూరులో అసాధారణ మరణాలపై సీఎం కార్యాలయం సవివర నివేదిక కోరినట్లు తెలిసింది. ఆ మేరకు జిల్లాయంత్రాంగం అంతర్గత విచారణ చేపట్టింది.
గుంటూరులో అసాధారణ మరణాలపై అంతర్గత విచారణ - Guntur latest news
గుంటూరు బొంగరాలబీడు మహాప్రస్థానానికి మృతదేహాల తాకిడి కొనసాగుతూనే ఉంది. ఈ అసాధారణ మరణాలపై జిల్లా యంత్రాంగం అంతర్గత విచారణ చేపట్టింది. శ్మశానానికి వచ్చే మృతదేహాల వివరాలపై ఆరా తీశారు.
మున్సిపల్, రెవెన్యూ శాఖ అధికారులు బొంగరాలబీడుకు వెళ్లి మహాప్రస్థానం సమితి నిర్వాహకుల వద్ద ఉన్న రికార్డుల్ని.. పరిశీలించారు. మృతుల ఆధార్ కార్డులు, ఆస్పత్రి యాజమాన్యాలు ఇచ్చిన మరణ కారణపత్రాల్ని పరిశీలించి, కొన్ని రికార్డులు తమ వెంట తీసుకెళ్లారు. ఎన్ని మృతదేహాలు వస్తున్నాయి.? అందులో సాధారణ మరణాలెన్ని? కొవిడ్ ప్రభావిత మరణాలు ఎన్ననే విషయాన్ని ఆరా తీశారు. మృతదేహాలన్నీ ఒకేచోట కాకుండా వేర్వేరు చోట్ల అంత్యయక్రియలు నిర్వహించాలని శ్మశానంలో దహన సంస్కారాలు నిర్వహిస్తున్న స్వచ్ఛందసేవకులను అధికారులు కోరగా..సాధ్యపడదని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇదీచదవండి.