ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుటుంబంలో స్వల్ప వివాదం..మనస్తాపంతో ఇంటర్​ విద్యార్థిని ఆత్మహత్య - స్వల్ప వివాదం కారణంగా సేవనాయక్ తండాలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని

గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం సేవనాయక్ తండాలో.. కుటుంబంలో నెలకొన్న స్వల్ప వివాదం విషయంలో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న రమవత్ హారిక బావిలో దూకి తనువు చాలించింది.

కుటుంబంలో స్వల్ప వివాదం
కుటుంబంలో స్వల్ప వివాదం

By

Published : Dec 11, 2020, 11:06 PM IST

మనస్తాపంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన.. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం సేవనాయక్ తండాలో జరిగింది. చిన్న విషయమై కుటుంబంలో స్వల్ప వివాదం జరగ్గా.. రమావత్ హారిక అనే బాలిక బావిలో దూకి ప్రాణాలు తీసుకుంది.

పదహారేళ్ల రమావత్ హారిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అనుకోని ఈ ఘటనతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెల్దుర్తి పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details