ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Love Marriage: గుంటూరులో ప్రియుడు.. రష్యాలో 'సెల్సియా'.. ఆసక్తికరమైన ప్రేమ వివాహం! - love Marriage in guntur

love Marriage in guntur: అది రష్యాలోని కిరికిస్థాన్ ఓష్ స్టేట్ మెడికల్ వర్శిటీ.. గుంటూరు అబ్బాయి.. తమిళనాడు అమ్మాయి..! అబ్బాయి సీనియర్.. అమ్మాయి జూనియర్..! స్నేహం కుదిరింది.. అదీ కాస్త ప్రేమగా మారింది..! మూడేళ్లు గడిచిపోయాయి..! పెళ్లి విషయం తెరపైకి వచ్చింది..! వీరి ప్రేమ విషయాన్ని.. తల్లిదండ్రుల ముందు ఉంచారు..! కానీ అమ్మాయి తరపువారు ఒప్పుకోలేదు..! అంతలోనే అబ్బాయి తల్లిదండ్రులు రూటు మార్చారు.. వెంటనే మరో వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు..! అంతేనా ఏకంగా నిశ్చితార్థానికి టైం ఫిక్స్ చేసేశారు. ఈ వ్యవహారమంతా.. రష్యాలో ఉన్న.. ప్రియురాలు సెల్సియా వరకు చేరింది. ఇంకేముంది ప్రాణంగా ప్రేమించిన అతగాడి కోసం.. ఖండాలను దాటేందుకు సిద్ధమైంది. అందుకోసం సోషల్ మీడియాను వేదిక చేసుకుంది. వాట్సాప్​ ద్వారా సత్తెనపల్లిలోని పలువురును ఆశ్రయించింది...! ప్రియుడిని పెళ్లి చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న సెల్సియా.. రష్యా నుంచి బయల్దేరింది. ఇక ఫైనల్​గా ఈ ప్రేమ వివాహానికి ఎలా ఎండ్ కార్డ్ పడిందో మీరూ చూడండి..!

Love Marriage
Love Marriage

By

Published : Feb 9, 2022, 7:19 PM IST

Updated : Feb 9, 2022, 9:47 PM IST

love Marriage in guntur:ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకునేందుకు ఎదురైన ఇబ్బందులను ఆమె అధిగమించింది. అతని వద్దకు రావడానికి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చింది. ఎట్టకేలకు మనసుకు నచ్చిన వ్యక్తిని మనువాడింది. ఈ ప్రేమ వివాహంలో సామాజిక మాధ్యమం కీలక పాత్ర పోషించందనే చెప్పాలి.

వివాహానంతరం అనంత్‌కుమార్‌, సెల్సియా

వివరాలు ఇలా...
నూతన దంపతులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడుకు చెందిన నల్లబోతుల నరసింహారావు, బుర్రమ్మల కుమారుడు అనంత్‌కుమార్‌ ఎంబీబీఎస్‌ చదివేందుకు రష్యాలోని కిరికిస్థాన్‌ ఓష్‌ స్టేట్‌ మెడికల్స్‌ యూనివర్శిటీలో 2015లో చేరారు. తమిళనాడు రాష్ట్రం మధురైకు చెందిన గణేషన్‌ గుణశీలన్‌, ఇందిరాగాంధీల కుమార్తె సెల్సియా 2017లో అదే విశ్వవిద్యాలయంలో చేరారు. ప్రస్తుతం ఆమె వైద్య విద్య చివరి సంవత్సరం అభ్యసిస్తున్నారు. వారి మధ్య స్నేహం ప్రేమగా మారింది. మూడేళ్లుగా ప్రేమలో ఉన్న వారు తల్లిదండ్రులకు విషయం చెప్పారు. అతని తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించగా, కులం, రాష్ట్రం, భాష వేరు అనే కారణాలతో ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. గత ఏడాది జూన్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన అనంత్‌కుమార్‌ ప్రేమికురాలి కుటుంబ సభ్యులను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అంతేకాదు.. సెల్సియా కిరికిస్థాన్‌ నుంచి రాకముందే వేరొకరిని పెళ్లి చేసుకోవాలని వారు సలహా ఇచ్చారు.

రష్యా టూ సత్తెనపల్లి..!
ప్రియుడికి అతని తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే విషయం ఆమెకు తెలిసింది. సామాజిక మాధ్యమాల సాయంతో సత్తెనపల్లి ప్రాంతానికి చెందిన పలువురితో మాట్లాడారు. గత నెల 24న సత్తెనపల్లికి చెందిన న్యాయవాది, జనసేన పార్టీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావుకు వాట్సాప్‌ కాల్‌ చేసి సాయం కోరారు. ఆమె ప్రేమలో నిజాయతీని గుర్తించి 27న సత్తెనపల్లి గ్రామీణ సీఐ ఉమేష్‌, ఎస్సై బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. పెళ్లి విషయంలో ముందుకు వెళ్లొద్దని అనంత్‌కుమార్‌ తల్లిదండ్రులకు సూచించారు. ఈ నేపథ్యంలో అనంత్‌కుమార్‌, అతని తండ్రి.. సెల్సియా తల్లిదండ్రులతో మాట్లాడినా వారు పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ నెల 6న పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవాలనే తలంపుతో అనంత్‌ కుమార్‌ చైన్నెలో నివసిస్తున్న తెలుగు యువతితో నిశ్చితార్థం చేసుకున్నారు.

అయితే.. ప్రియుడిని పెళ్లి చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న సెల్సియా రష్యా నుంచి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అదే రోజు మధ్యాహ్నం సత్తెనపల్లి వచ్చారు. అప్పటికే నిశ్చితార్థం అయిపోవడంతో తర్జనభర్జనల అనంతరం అనంత్‌కుమార్‌ రద్దు చేసుకున్నారు. మూడు రోజులపాటు జనసేన వీరమహిళ నామాల పుష్పలత సెల్సియాకు ఆశ్రయమిచ్చారు. సత్తెనపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో మంగళవారం డాక్టర్‌ అనంత్‌కుమార్‌, కాబోయే వైద్యురాలు సెల్సియా పెళ్లితో ఒక్కటయ్యారు. సెల్సియా సత్తెనపల్లిలో వివాహం చేసుకుంటోందని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చారు. ఆమె తల్లిదండ్రులు, బంధువులతో సీఐ ఉమేష్‌ మాట్లాడారు. చట్టబద్ధంగా జరిగిన వివాహనికి సమ్మతి తెలపాలని సూచించారు.

ఇదీ చదవండి:

PRC Steering Committee: 'మేం సమ్మెను విరమించుకున్నాం.. మీరు చేయవచ్చు కదా..?

Last Updated : Feb 9, 2022, 9:47 PM IST

ABOUT THE AUTHOR

...view details