వ్యవసాయ రుణాలకు సంబంధించిన వడ్డీని ఈనెలలో జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తెలిపారు. రైతులు గతేడాది బ్యాంకుల్లో తీసుకున్న మొత్తానికి వడ్డీని వారి ఖాతాల్లో వేయనున్నామని వెల్లడించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని రైతు భరోసా కేంద్రాన్ని ఆయన సందర్శించారు.
కౌలు రైతులకూ సున్నా వడ్డీ పథకం వర్తిస్తుందని కమిషనర్ పేర్కొన్నారు. సీసీఆర్సీ లేదా రైతు గ్రూపులకు స్థానిక ఈవో ఇచ్చే ధ్రువీకరణ పత్రం ద్వారా బ్యాంకు రుణం పొందవచ్చని తెలిపారు. తైవాన్ స్ర్పేయర్లు తక్కువ ధరకు అందించేందుకు.. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడతామని వివరించారు.