సముద్రంలో స్నానానికి దిగారు.. ఆ తర్వాత?
వారంతా ఇంటర్ విద్యార్థులు.. సరదాగా సముద్ర స్నానానికి వచ్చారు. నలుగురిలో ఒకరిని కెరటాలు సముద్రంలోకి లాక్కెళ్లాయి.
వారాంతాన్ని... సరదాగా గడపాలనుకున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు విషాదం ఎదురైంది. గుంటూరులోని మాస్టర్ మైండ్స్ సీఏ అకాడమీకి చెందిన నలుగురు ఇంటరు ద్వితీయసంవత్సరం విద్యార్థులు సరదాగా గడిపేందుకు ప్రకాశంజిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరానికి వచ్చారు. అక్కడ నలుగురు సముద్రంలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యార్థుల్లో ఒకరైన జశ్వంత్( 18 ) అలల తాకిడికి సముద్రంలో కొట్టుకుపోయాడు. ఇది గమనించిన స్థానికులు, మెరైన్ పోలీసులు మరో విద్యార్థి సూర్య సంజయ్‌ని రక్షించి తీరానికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చీరాలలొని ప్రవేటు వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. గల్లంతైన సూర్యసంజయ్ కోసం సముద్రంలొ గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టారు.