గుంటూరు జిల్లా తాడేపల్లి నులకపేటలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. విజయవాడలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని కృష్ణ సౌజన్య ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని తరలించేందుకు బంధువులు సిద్ధపడగా..... స్థానికులు అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని...పోస్టుమార్టంకు తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు కారణాలపై విచారణ చేపట్టారు.
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య - నులకపేటలో విద్యార్థిని సూసైడ్ వార్తలు
విజయవాడలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి నులకపేటలో జరిగింది. మృతదేహన్ని బంధువులు గట్టుచప్పడు కాకుండా తలించేందుకు సిద్ధపడగా స్థానికులు అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు.
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య