ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్​.. వారిలో ఇద్దరు మహిళలు - అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు

పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను గుంటూరు జిల్లా అర్బన్ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. నిందితుల నుంచి సుమారు రూ.7 లక్షల విలువైన బంగారం, రూ.47,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.

inter state thiefs caught
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

By

Published : Jan 12, 2021, 8:15 PM IST

పగటి పూట ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను గుంటూరు జిల్లా అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.6.96 లక్షల విలువైన బంగారు అభరణాలను, రూ.47,500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల్లో నారాయణమ్మ, నరసమ్మ అనే ఇద్దరు మహిళలు ఉన్నారు. నిందితులు తల వెంట్రుకలు కొనుగోలు పేరుతో రెక్కీ నిర్వహించి చోరీలకు పాల్పడేవారని ఎస్పీ వివరించారు. ప్రధాన నిందితుడు రంగనాధం కిరణ్​పై పలు జిల్లాల్లో 26 కేసులు, రెండో నిందితుడు విజయ్ పై వివిధ జిల్లాల్లో 10 కేసులు నమోదైనట్లు ఎస్పీ తెలిపారు. పండగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని.. పోలీసులు అమలు చేస్తున్న లాక్​ హౌస్ మానిటరింగ్ సిస్టం యాప్ ను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:కామధేనుపూజలో పాల్గొననున్న సీఎం.. ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు

ABOUT THE AUTHOR

...view details